ఈ ఆర్టికల్ పైనున్న ఇమేజ్‌ను చూశారా. అదొక మొబైల్ ఫోన్ వాల్‌పేపర్. పొరపాటున కూడా దాన్ని డౌన్‌లోడ్ చేయకండి అంటున్నారు ఆండ్రాయిడ్ డెవలపర్స్. ఎందుకంటే అది మీఫోన్‌ను పని చేయకుండా చేస్తుందట.
ఏమిటి సమస్య?
ఆండ్రాయిడ్ ఫోన్లలోని ఆపరేటింగ్ సిస్టమ్.. ఇమేజ్‌లను డిస్‌ప్లే చేయడానికి స్టాండర్డ్ ఆర్‌జీబీ (sRGB) ఫార్మాట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనిలో కలర్ స్పేస్‌ను 255 లుమినెన్స్‌కి పరిమితం చేసింది. అయితే పైన కనిపిస్తున్న వాల్‌పేపర్ ఇమేజ్ ప్రోఫోటో ఆర్‌జీబీ ఫార్మాట్‌లో ఉంటుంది. ఇది స్టాండర్ట్ ఆర్‌జీబీ కంటే పెద్ద రేంజ్. అయితే ఈ ఇమేజ్‌లోని ఒక పిక్సెల్ 256 లుమినెన్స్‌తో వస్తుంది. అందువల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను క్రాష్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏయే ఫోన్లకు సమస్య వస్తుందంటే..
ఈ వాల్‌పేపర్ ఇమేజ్‌లోని బగ్ వల్ల ముఖ్యంగా ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో నడిచే ఫోన్లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో నడిచే గూగుల్, శాంసంగ్ ఫోన్లలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందట. అయితే నేరుగా ఈ ఇమేజ్‌ను డౌన్లోడ్ చేస్తేనే సమస్య వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకుని పెట్టుకుంటే ఫోన్లు క్రాష్ కావడం లేదని గుర్తించారు. కాబట్టి బీకేర్‌ఫుల్. ఈ ఇమేజ్‌ను మీ వాల్‌పేపర్‌గా పెట్టుకోకపోవడమే మంచిది అంటున్నారు ఆండ్రాయిడ్ డెవలపర్స్.