ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్. ఇండియాలోనే 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ వాడుతున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో వాట్సాప్ వినియోగం మామూలు రోజుల కంటే దాదాపు 40 శాతం పెరిగిందట. దీంతో వాట్సాప్ పేమెంట్స్‌ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు హ్యాకర్లు వాట్సాప్ అకౌంట్ల మీద కన్నేశారు.
వెరిఫికేషన్ కోడ్ అడుగుతారు
వాట్సాప్ టెక్నికల్ టీమ్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నామంటూ మీతో చాట్ చేస్తారు. వారి ప్రొఫైల్ పిక్చర్‌గా వాట్సాప్ లోగో పెట్టుకోవడంతో చాలామంది వాళ్లు నిజంగా వాట్సాప్ టెక్నికల్ టీమే అనుకుని పొరబడుతున్నారు. మీ ఆరంకెల వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ చెప్పమని అడుగుతారు. దీంతో మీ వాట్సాప్ అకౌంట్‌ను రిజిస్టర్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
గుర్తుంచుకోండి. వాట్సాప్ ఎప్పుడూ తన యూజర్లను కాంటాక్ట్ చేయదు.
కోడ్ చెబితే
మీరు గనుక అది నమ్మి వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ చెప్పారా వాళ్లు మీ వాట్సాప్ అకౌంట్‌ను వాళ్ల కంట్రోల్‌లోకి తీసుకుంటారు.
దాని ద్వారా ఎవరికైనా అసభ్యకరమైనవి, ప్రమాదకరమైన మెసేజ్‌లు పంపుతారు.
మీ వాట్సాప్‌ను బ్యాకప్ తీసుకుని మీ పర్సనల్ ఫొటోలు, వీడియోలు కూడా డౌన్‌లోడ్ చేసుకుని బెదిరింపులకు దిగుతారు.
ఈ స్కామ్ బారినపడితే ఏం చేయాలి?
మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే మీరు వాట్సాప్ వాడుతున్న డివైస్‌లో వెంటనే దాన్ని సైన్ అవుట్ చేయండి. * ఇప్పుడు మళ్లీ మీ వాట్సాప్ అకౌంట్‌ను రీవెరిఫై చేయండి.
* అంతేకాదు మీ వాట్సాప్ అకౌంట్ హ్యాకయిందని మీ కాంటాక్ట్స్,గ్రూప్స్ అందరికీ మెసేజ్ పెట్టండి.
* అప్పుడు ఒకవేళ మీ వాట్సాప్ అకౌంట్ నుంచి ఏదైనా ఇబ్బందికరమైన మెసేజ్ కానీ కాల్స్ గానీ వెళ్లినా అవతలివారు అపార్థం చేసుకోకుండా ఉంటారు.