ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక. మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్స్, ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్‌ను యాక్సెస్ చేసేసి, మీ పాస్‌వర్డ్‌లు కూడా కొట్టేసే ఓ డేంజరస్ వైరస్ వచ్చేసింది. ఇది చాలా డేంజరస్ వైరస్ అని మీ ఫైనాన్షియల్ యాప్స్‌ను యాక్సెస్ చేయడమే కాదు.. మీకొచ్చే ఎస్ఎంఎస్‌లన్నీ చదివేస్తుందని, యాప్స్‌కి ఎంతో సెక్యూరిటీ ఇచ్చే టూ స్టెప్ అథెంటికేషన్‌ను కూడా బైపాస్ చేసేయగలదని గుర్తించారు. ఈ విషయం చెప్పింది అల్లాటప్పా సంస్థ కాదు.. ఇండియన్ గవర్నమెంట్‌కి నోడల్ ఏజెన్సీగా పని చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (కెర్ట్). ఇంతకీ కెర్ట్ ఈ వైరస్ గురించి ఏం చెప్పింది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఈవెంట్‌బోట్
* ఈ మాల్వేర్ పేరు ఈవెంట్ బోట్. ఇదొక బ్యాంకింగ్ ట్రోజన్.
* ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఇంటర్ యాక్సెసబులిటీ ఫీచర్లను యాక్సెస్ చేస్తుంది.
* దీని ద్వారా మీ ఫోన్లో ఉన్న బ్యాంకింగ్, ఇతర ఫైనాన్షియల్ యాప్స్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుంది. వాటిని ఓపెన్ చేయడానికి మీరు వాడే పాస్‌వర్డ్‌లను కూడా రీడ్ చేసేస్తుంది.
* అంతేకాదు మీకొచ్చే ఎస్ఎంఎస్‌లన్నీ చదివేస్తుంది.
* ఆఖరికి మీరు ఎంతో సెక్యూరిటీగా ఫీలయ్యే టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్‌ను కూడా బైపాస్ చేసేయగలదు.
* కాబట్టి ఇది మీ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డ్‌లు, పేమెంట్స్ యాప్స్ నుంచి మనీని కొట్టేయగలదు.
మనకు తక్కువే.. అలాగని అశ్రద్ధ వద్దు
ప్రస్తుతానికి ఈ ఈవెంట్‌బోట్ మాల్వేర్ అమెరికా, ఇతర యూరప్ దేశాల్లోని ఆండ్రాయిడ్ యూజర్ల ఆండ్రాయిడ్ డివైస్‌లను మాత్రమే ఎక్కువ యాక్సెస్ చేయగలుగుతోంది. ఇండియాలో ప్రస్తుతానికి ఈవెంట్ బోట్ మాల్వేర్ ప్రభావం తక్కువేనని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని కెర్ట్ హెచ్చరిస్తోంది.
ఏయే యాప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయంటే?
పేపాల్ బిజినెస్, బార్క్‌లేస్, యూనిక్రెడిట్, హెచ్ఎస్‌బీసీ యూకే, క్యాపిటల్ వన్ యూకే, ట్రాన్స్‌ఫర్ వైజ్, కాయిన్‌బేస్, పేసేఫ్ కార్డ్ లాంటి యాప్స్, సర్వీసులను ఈవెంట్ బోట్ ఎక్కువగా అటాక్ చేస్తోందని కెర్ట్ వివరించింది. ఈ యాప్స్, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీస్‌లు ఇండియాలో లేవు కనుక ఈవెంట్ బోట్ ఇండియాలో ఇప్పటికి ఇంకా ప్రభావం చూపెట్టడం లేదని, అయితే ఇండియన్ ఆండ్రాయిడ్ యూజర్ల ఫోన్‌లోకి ఎంటరయితే మన బ్యాంకింగ్ యాప్స్‌నూ ఓ పట్టు పట్టేస్తుందని కెర్ట్ హెచ్చరించింది.
ఇలా జాగ్రత్తపడండి
* ఈ మాల్వేర్ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారానే మీ ఫోన్‌లోకి చొరబడుతుంది, కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ యాప్స్‌ను, ప్రోగ్రామ్స్‌ను థర్డ్ పార్టీ ఫ్లాట్‌ఫాంలపై డౌన్‌లోడ్ చేయొద్దు.
* మీకు ఎలాంటి యాప్ కావాల్సి వచ్చినా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి.
* అంతేకాదు ఎవరైనా పంపిన లేదా ఎక్కడైనా కనిపించిన లింక్స్‌ను క్లిక్ చేసి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా ప్రమాదకరమే,
* యాప్ డౌన్‌లోడ్ చేసుకునేముందు తప్పనిసరిగా యాప్ డెవలపర్ పేరు, యాప్ డిటైల్స్, యూజర్ రివ్యూలు చదవండి, అప్పుడు మీకు ఆ యాప్ సేఫా కాదా అనేది అర్థమవుతుంది,