• తాజా వార్తలు

ఆన్ లైన్లో ఫర్నిచర్ కొందామని 2.5లక్షలు మోసపోయిన వైనం

షాపులకు వెళ్లి...కొనుగోలు చేసే రోజులు పోయాయ్. ఇంట్లో కూర్చుండే...గుండు పిన్ను నుంచి గోల్ట్ వరకు కొనుగోలు చేసే రోజులు ఇవి. ఈరోజుల్లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మెన్ ఈ మధ్య 2.5లక్షలు పెట్టి ఆన్ లైన్లో షాపింగ్ చేసి నిండా మునిగాడు. మీరూ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటారా అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే. 
* బాధితుడు తన ఆఫీస్ కోసం ఫర్నిచర్ కొనేందుకు ఇక ఈ కామర్స్ వెబ్ సైట్ ను చూశాడు. 
* ఆ వెబ్ సైట్లో ఆకట్టుకునే విధంగా ఎన్నో వస్తువులు ఉన్నాయి. 
*కొనుగోలు దారుడు తాను రిటైర్డ్ ఆర్మీ ఆఫీస్ గా పరిచయం చేసుకున్నాడు. 
*మిగతా వారికంటే తక్కువ ధరకే అమ్ముతానని చెపి...కొంత మొత్తం పేమెంట్ చేయాలని కోరాడు. 
* ఇద్దరి మధ్య డీల్ కుదిరాక...బాధితుడికి ఫోన్ల్ ఒక మెసేజ్ వచ్చింది. 
* upiలింక్ ను వెబ్ సైట్ లింక్ ను పంపిస్తే నగదు ట్రాన్స్ ఫర్ అవుతుందని మెసేజ్ లో పేర్కొన్నాడు. 
*బాధితుడు ఆ లింక్ పై క్లిక్ చేసిన క్షణాల్లో...నేరస్థుడి ఫోన్ కు రిమోట్ యాక్సెస్ అయ్యింది. 
* లింక్ ద్వారా...బాధితుడి బ్యాంక్ వివరాలతోపాటు ఫోన్లో ఉన్న ఫోటోలు, మెసేజ్ లు అన్నీ కూడా యాక్సెస్ చేశాడు. దీంతో బాధితుడి అకౌంట్లో నుంచి 2.5 లక్షలు మాయం అయ్యాయి. 
మోసపోయానని గమనించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకామర్స్ వెబ్ సైట్ల ద్వారా వచ్చిన ఎస్ ఎంఎస్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏదైనా లింక్ పై క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నాయి. 

జన రంజకమైన వార్తలు