int(5130) ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌ - Computervignanam - Telugu Technology News

ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

 ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో రోజుకో కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో సైబ‌ర్ క్రిమినల్స్ జ‌నాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా బెంగ‌ళూరుకు చెందిన ఓ పారిశ్రామిక‌వేత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను డీయాక్టివేట్  చేసి, అత‌ని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అత‌ని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 ల‌క్ష‌లు కొట్టేశారు. అది కూడా జ‌స్ట్ అర‌గంట‌లోనే ట్రాన్సాక్ష‌న్ పూర్త‌యిపోయింది.  దీనిమీద బాధితుడు కంప్ల‌యింట్ చేయ‌డానికి వెళితే పోలీసులు కంప్ల‌యింట్ తీసుకోవ‌డానికి 24 గంట‌లు ప‌ట్టింది. ఇక‌పోతే సిమ్ ఇచ్చిన ఎయిర్‌టెల్ అయితే త‌మ‌కేం బాధ్య‌త లేదంటూ చేతులెత్తేసింది. 

ఇదీ జ‌రిగింది
క‌ర్ణాట‌క‌లోని హెగ్గ‌న‌హ‌ళ్లిలో టీవీ జ‌గ‌దీష్ అనే  వ్య‌క్తి క్రియేటివ్ ఇంజినీర్స్ అనే ఓ సంస్థ‌ను న‌డుపుతున్నారు. ఆయ‌న ఎయిర్‌టెల్ కార్పొరేట్ సిమ్ వాడుతున్నారు.  స‌డెన్‌గా ఓ రోజు సిమ్ ప‌ని చేయ‌డం మానేసింది.  జ‌గదీష్ వేరే సిమ్ నుంచి ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసి త‌న సిమ్ యాక్టివేట్ చేయ‌మ‌ని అడిగారు. అయితే అది కార్పొరేట్ సిమ్ కాబ‌ట్టి కంపెనీ లెట‌ర్ ఇస్తేనే సిమ్ యాక్టివేట్ చేస్తామ‌ని ఎయిర్‌టెల్ వాళ్లు చెప్పారు. ఈలోగా జ‌గ‌దీష్ భార్య మంగ‌ళ ఆయ‌న బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే వాటిలో నుంచి 45 ల‌క్ష‌లు 5 కెన‌రా బ్యాంక్ అకౌంట్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేసిన‌ట్లు కనిపించింది. అవి తాను చేయ‌లేద‌ని జ‌గ‌దీష్ చెప్ప‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించారు. 

24 గంట‌ల త‌ర్వాత కంప్ల‌యింట్ 
దీనిపై పోలీస్ స్టేష‌న్‌కు వెళితే రెండు స్టేష‌న్లు తిప్పి 24 గంట‌ల త‌ర్వాత గానీ పోలీసులు కంప్ల‌యింట్ తీసుకోలేదు. ఇది చాలా అన్యాయ‌మ‌ని జ‌గ‌దీష్ అన్నారు.  సైబ‌ర్ క్రిమినల్స్ కావాల‌నే జ‌గ‌దీష్ సిమ్ హ్యాక్ చేసి దాన్ని డీయాక్టివేట్ చేశారని, ఆ త‌ర్వాత ఈ మెయిల్ కూడా హ్యాక్ చేసి దాని ద్వారా ఎయిర్‌టెల్ సిమ్ కావాల‌ని మెయిల్ పెట్టార‌ని పోలీసుల చెబుతున్నారు. సిమ్ చేతికొచ్చాక వాళ్లు దాన్ని ఉప‌యోగించుకుని యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌లు క్రియేట్ చేసుకుని డ‌బ్బులు త‌మ అకౌంట్ల‌లోకి ట్రాన్స్ ఫ‌ర్ చేసేసుకున్నార‌ని ప్రాథ‌మికంగా అనుమానిస్తున్నారు 
 

మా త‌ప్పు కాదంటున్న ఎయిర్‌టెల్  
త‌న‌కు తెలియ‌కుండానే త‌న ఎయిర్‌టెల్ కార్పొరేట్ సిమ్ వేరేవాళ్ల‌కు ఎలా ఇస్తార‌ని జ‌గ‌దీష్  ప్ర‌శ్నిస్తున్నారు. ఎయిర్‌టెల్ బాధ్య‌తారాహిత్యంతో తాను షాక్ తిన్నాన‌ని చెబుతున్నారు. అయితే ఎయిర్‌టెల్ సిబ్బంది మాత్రం త‌ప్పు త‌మ‌ది కాదంటున్నారు.  జ‌గ‌దీష్ మెయిల్ నుంచే రిక్వెస్ట్ వ‌చ్చింద‌ని, అందుకే తాము కొత్త సిమ్ కార్డు ఇచ్చామ‌ని చెబుతున్నారు.   

 
 

ఎయిర్‌టెల్ సిమ్ హ్యాకింగ్‌ సైబ‌ర్ క్రైమ్‌ Airtel Sim Hacking Sim card Hacking Cyber crime