• తాజా వార్తలు

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.

వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి స్పిన్‌ వీల్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ‘డీమార్ట్‌’ పేరుతో స్పిన్‌వీల్‌ మోసాలకు సైబర్‌ నేరగాళ్లు పాల్పడుతున్నారని చెప్పారు. స్పిన్‌ వీల్‌ తిప్పితే ఉచిత బహుమతులంటూ మోసాలు చేస్తున్నారన్నారు. వాట్సాప్‌లో సైబర్‌ నేరగాళ్లు లింకులు పంపుతున్నారని, వాటిని క్లిక్‌ చేయవద్దని సైబర్‌ పోలీసులు హెచ్చరించారు.  

ఎలా మోసం చేస్తారు?

స్పిన్ వీల్ తిప్పితే మీకు ఏదో ఒక బహుమతి వస్తుందని మీకు వచ్చిన మెసేజ్ లో వుంటుంది. స్పిన్ చేయడానికి వీల్ కూడా ఉంటుంది. అది తిప్పితే ఒక గిఫ్ట్ వచ్చినట్టు చూపిస్తుంది. ఆ గిఫ్ట్ పొందాలంటే ఈ మెసెజ్ 20 మంది ఫ్రెండ్స్ లేదా 5 వాట్సప్ గ్రూప్స్ కి పంపమని పాప్ అప్ మెసేజ్ వస్తుంది . అదేమి ఖర్చయేది కాదు, పైగా గిఫ్ట్ వస్తుందని మనం వేరేవాళ్లకి ఆ మెసెజ్  పంపిస్తాం. ఇలా ఒక చైన్ మాదిరిగా ఆ మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది. ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే అది మీ డేటా కొట్టేయొచ్చు. లేదా మీ ఫోన్లో మాల్వేర్ ఇన్ స్టాల్ చెయ్యొచ్చు. అందుకే ఇలాంటి మెసేజీలకు టెంప్ట్ అయ్యి చిక్కుల్లో పడకండి. అలాంటి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి. అవి మన డేటా కొట్టేసే ప్రమాదం ఉన్న మెసేజ్ పంపొద్దని వాళ్లకు చెప్పండి.

జన రంజకమైన వార్తలు