పేటీఎం యాప్... భారత్‌లో ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత పేటీఎంకు బాగా గిరాకీ పెరిగిపోయింది టీ షాపుల వాళ్లు సైతం పేటీఎంనే వాడుతున్నారు. అయితే జనం ఇంతగా నమ్ముతున్న పేటీఎం యాప్‌లో కూడా ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయట. ఇటీవలే జైపుర్‌లోని ఒక టెకీకి ఇలాంటి అనుభవమే ఎదురైంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు, మొబైల్ వాలెట్స్ ద్వారా మోసాలను తావుందని నిపుణులు చెబుతున్నారు.
ఏంటి మోసం..
భారత్‌లో డిజిటల్ ట్రాన్సాక్షన్లకు పేటీఎం ఒక మార్గం. డిజిటల్ లావాదేవీలు చేయాలంటే ఎక్కువమంది పేటీఎం యాప్‌నే నమ్ముతున్నారు. అయితే పేటీఎం యాప్ చాలా సేఫ్ అని ఆ సంస్థ చెబుతున్నా.. ఓటీపీని ఛేదిస్తే చాలు సులభంగా మోసం చేయచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇంతకముందు జరిగిన ఆన్‌లైన్ మోసాల్లో అపరిచితులు ఫోన్ చేయడం ద్వారా ఓటీపీని సంగ్రహించి మోస్ చేసేవాళ్లు. ఓటీపీ షేర్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా అయిపోయేవి. ఇప్పుడు మోసగాళ్లు మరింత అడ్వాన్డ్‌గా వెళుతున్నారు. నేరుగా ఇళ్లలోకే చొరబడుతున్నారు!
ఏం జరిగిందంటే..
జైపుర్‌లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. శోభిత్ అనే టెకీ దీని బాధితుడు. పేటీఎం ఐడీ ధరించిన ఒక అపరిచిత వ్యక్తి వాళ్ల ఇంటికి వచ్చాడు. అతని అమ్మమ్మ ఈ కేవైసీ డిటైట్స్ పూర్తి చేయడానికి వచ్చానని అతను చెప్పాడు. ప్రస్తుతం మొబైల్ వాలెట్స్‌కు కేవైసీ చాలా కీలకం. కేవైసీ లేకపోతే వాలెట్ ట్రాన్సాక్షన్లు చేయడం కుదరదు. శోభిత్ గ్రాండ్ మదర్ కూడా ఇలాగే అనుకుంది. ఒకే కేవైసీ కంప్లీట్ చేయండి అని చెప్పింది. ఇందుకు ఆ అపరిచితుడు ఆమె దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్లు అడిగాడు. ఆ తర్వాత అతను పేటీఎం లాంటి ఒక యాప్ ఓపెన్ చేశాడు. కానీ అది పేటీఎం కాదు. అందులో ఆమె డిటైల్స్ ఎంటర్ చేయమని చెప్పాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శోభిత్ వెంటనే అక్కడ అతను నోట్ డౌన్ చేసుకున్న వివరాలను చూసి వాటిని తీసుకుని అతని పేరు అడిగాడు. అంతే అతను వెంటనే అక్కడ నుంచి పారిపోయాడట. శోభిత్ వెంటనే గుర్తించబట్టి సరిపోయింది లేకపోతే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యేవి. అందుకే పేటీఎం కేవైసీ పేరుతో ఎవరైనా అప్రోచ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు.