కొంత మొత్తం రికవరీ అయిన బంగ్లాదేశ్ బ్యాంకు సొమ్ము గత నెలలో బంగ్లాదేశ్ యొక్క అమెరికన్ ఎకౌంటు నుండి మాయం అయిన 675 కోట్ల రూపాయల లో కొంత మొత్తం రికవరీ అయినట్లు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అసలు ఆ డబ్బు ను మాయం చేసిందెవరు? ఎలా మాయం అయింది? తిరిగి ఎలా రికవరీ అయింది? ప్రతీ దేశం తన యొక్క ఫారిన్ మనీ ని వివిధ దేశాలలోని బ్యాంకు లలో నిలువ ఉంచుతుంది. అలాగే బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ రిజర్వు మనీ విలువ సుమారు 1,88,721 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ బ్యాంకు ఎకౌంటు ఒకటి న్యూ యార్క్ లో ఉన్నది. న్యూ యార్క్ లో ఉన్న ఫెడరల్ రిజర్వు బ్యాంకు లో బంగ్లాదేశ్ కు చెందిన ఎకౌంటు ఒకటి ఉన్నది.అక్కడ ఉన్న సొమ్ములో కొంత మొత్తం అంటే సుమారు గా 675 కోట్ల రూపాయల వరకూ గత నెలలో మాయం జరిగింది. ఇది చైనా కు చెందిన హ్యాకర్ ల పని అని బ్యాంకు వర్గాలు భావించాయి.అక్కడి నుండి మాయం అయిన సొమ్ము శ్రీలంక మరియు ఫిలిప్పీన్స్ దేశాలకు ట్రాన్స్ ఫర్ అయినట్లు విచారణలో తేలింది. బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక నిఘా విభాగం ఫిలిప్పీన్స్ కు సంబందించిన యాంటీ మనీ ల్యాండరింగ్ అథారిటీ తో మంచి సంబందాలను కలిగిఉన్నది. ఫిలిప్పీన్స్ కు తరలి వెళ్ళిన మొత్తాన్ని బంగ్లాదేశ్ కు ఇప్పించడం లో ఈ అథారిటీ సహాయం చేసింది. మనీ ల్యాండరింగ్ ద్వారా ఫిలిప్పీన్స్ ఎకౌంటు లకు జమ అయిన డబ్బును ఈ అథారిటీ ఫ్రీజ్ చేసింది.ఫిలిప్పీన్స్ లో ఉన్న మూడు కాసినో ల యొక్క ఎకౌంటు లకు ఈ డబ్బు ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడనుండి ఫిలిప్పీన్స్ అథారిటీ ఈ డబ్బును వసూలు చేసి బంగ్లాదేశ్ కు తిరిగి అప్పగించింది. అయితే శ్రీలంక కు ట్రాన్స్ ఫర్ అయిన మొత్తం రావలసి ఉన్నట్లు బంగ్లాదేశ్ యొక్క సెంట్రల్ బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. |