నేడు ప్రపంచం లో మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో మానవ అక్రమ రవాణా ఒకటి. బానిసత్వానికి ఆధునిక రూపం గా దీనిని చెప్పుకోవచ్చు. ముఖ్యం గా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే ఈ సమస్య ఒక పెనుభూతంగా మారింది. టెక్సాస్ మరియు కాలిఫోర్నియా లలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఏటా సుమారు 17,500 మంది ఈ కూపం లో చిక్కున్తున్నట్లు అమెరికా అధికార వర్గాలు చేబుత్న్నాయి. కానీ ఈ లెక్క ఇంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. బాధితులంతా అమెరికన్లు, విదేశీయులూ, పురుషులు, మహిళలు, టీనేజర్లు ఇలా అన్ని వర్గాలకు చెందినా వారు ఉన్నారంటే దీని తీవ్రత ఎ స్థాయి లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ మానవ రవాణాను ఉపయోగించి జరుగుతున్న అత్యంత హేయమైన అంశం లైంగిక వ్యాపారం. అమెరికా లో ఈ లైంగిక వ్యాపారం తీవ్ర స్థాయి లో ఉంది. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఈ లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడేలా ఒక యాప్ రూపొందింది. ఈ యాప్ పేరు ట్రాఫిక్ క్యాం సాధారణంగా ఈ లైంగిక వ్యాపార బాధితులు స్టార్ హోటల్ ల లో ఉంటారు. హోటల్ రూమ్ లు మరియు వాటి పరిసరాల్లో ఈ లైంగిక వ్యాపారం జరుగుతున్న ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తే వెంటనే మీ స్మార్ట్ ఫోన్ లో దానిని ఫోటో తీసి ఈ యాప్ లో అప్ డేట్ చేస్తే చాలు, అధికార వర్గాలు మిగతా పని చూసుకుంటాయి. మొత్తం లక్షా యాభై వేల ఫోటో లు అప్పటికే ఈ యాప్ లో అప్ లోడ్ చేయబడి ఉంటాయి. మనం మన స్మార్ట్ ఫోన్ లో ఫోటో తీసిన వెంటనే ఈ యాప్ ఆ ఫోటో లను మ్యాచ్ చేసి చూస్తుంది.గత సంవత్సరం మొత్తం సుమారు 4000 కంటే ఎక్కువ ఇలాంటి కేసులు నమోదు అయినట్లు నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ రిసోర్స్ సెంటర్ వర్గాలు వెల్లడించాయి. ఈ లైంగిక వ్యాపారం లో ఎంతమంది మైనర్ బాలలు ఉన్నారనేది అమెరికా న్యాయ శాఖ కూడా చెప్పలేకపోతుంది. ఈ ట్రాఫిక్ క్యాం అనే యాప్ వినియోగదారులను ఫోటో లు తీయలసిండిగా అడుగుతుంది. ఈ ఫోటో లను జత పరచి చూస్తుంది. ఆ తర్వాత వాతి౮ని అమెరికా ప్రభుత్వానికి నివేదిస్తుంది. అయితే అమెరికా లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. దీనిపై విస్తృత ప్రచారం జరగవలసిన అవసరం ఉంది. |