int(5186)
రోజూ ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కానో ట్రాక్ చేసుకోవడానికి ఓ యువకుడు ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అతను సైక్లింగ్ చేసే ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనానికి అతనికీ సంబంధం ఉందని పోలీసులు అతణ్ని అనుమానించేశారు. ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్లోని సమాచారంతో అతనికి జియో ఫెన్సింగ్ నోటిఫికేషన్ కూడా పంపేశారు. ఇంతకీ అతను చేసిన తప్పేంటయ్యా అంటే దొంగతనం జరిగిన ఇంటి మీదుగా అతను రోజూ మూడుసార్లు సైకిల్ మీద వెళ్లడం. అతనే దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు జియో ఫెన్సింగ్ నోటీస్ పంపారు. అయితే చివరికి అతను దొంగ కాదని తేలింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.
ఫ్లోరిడాకు చెందిన జెకరీ మెక్కే అనే 30 ఏళ్ల యువకుడు రోజూ సైక్లింగ్ చేస్తుంటాడు. అతను సైక్లింగ్కు వెళ్లే మార్గంలో ఓ 92 ఏళ్ల ముసలావిడ ఇంట్లో ఓ రోజు దొంగతనం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలెట్టారు. ఆ చోరీ జరిగిన రోజు ఓ యువకుడు ఆ ఇంటిమీదుగా మూడుసార్లు వెళ్ళినట్లు ఐడెంటిఫై చేశారు. అతని సమాచారం తెలుసుకోవడానికి జియో ఫెన్సింగ్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అంటే క్రైమ్ జరిగిన రోజున అతను ఎక్కడున్నాడో గూగుల్ జియో లొకేషన్ ఆధారంగా గుర్తించి, గూగుల్ ఆ సమాచారం పోలీసులకు ఇవ్వాలన్నమాట. గూగుల్ ఈ సమాచారాన్ని , కేసు వివరాలను కూడా మెక్కేకి పంపించి విషయం చెప్పింది. అయితే అతను పోలీస్స్టేషన్కు వెళ్లలేదు. వెళితే తనను కేసులో ఇరికిస్తారన్న భయంతో ఉండిపోయాడు.
మెక్ కే ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న ఆ ముసలామె ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో చివరికి పోలీసులు తే
మెక్కేను ఎలా ఐడెంటిఫై చేశారు?
మెక్కే రన్కీపర్ అనే ఆండ్రాయిడ్ ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్ వాడుతున్నాడు. తాను సైక్లింగ్ ఎంత దూరం తొక్కానో తెలుసుకోవడానికి ఆ యాప్ వాడుతున్నాడు. ఆ యాప్లో అతను తిరిగిన గూగుల్ లొకేషన్ నోట్ అవుతుంది. అలా మెక్ కే ఆ రోజు అక్కడ మూడుసార్లు తిరిగాడని పోలీసులు గుర్తించారు.
చివరికి ఏమైంది?
మెక్కేకి ఈ కేసుతో సంబంధం ఉందని పోలీసులు నిరూపించలేకపోయారు. కేవలం అటు వైపు మూడుసార్లు తిరిగాడన్న ఒక్క ఆధారంతో అతనే దొంగని తేల్చలేమని ఒప్పుకున్నారు. దీంతో మెక్కే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అదంతా తనకో పీడకలలా గుర్తొస్తుందంటున్నాడు.
Google Geo location geo fencing notification గూగà±à°²à± జియో లొకేష‌నà±â€Œ à°«à°¿à°Ÿà±â€Œà°¨à±†à°¸à± à°Ÿà±à°°à°¾à°•ింగౠయాపà±â€Œ జియో ఫెనà±à°¸à°¿à°‚గౠనోటిఫికేష‌నà±â€Œ