int(5111) కెన‌డాకి కొరియ‌ర్ పంపాల‌నుకుని ఆన్‌లైన్‌లో 63,900 మోసానికి గురైన బెంగ‌ళూరు మ‌హిళ‌ - Computervignanam - Telugu Technology News

కెన‌డాకి కొరియ‌ర్ పంపాల‌నుకుని ఆన్‌లైన్‌లో 63,900 మోసానికి గురైన బెంగ‌ళూరు మ‌హిళ‌

ఇంట‌ర్నెట్ అందుబాటులోకి వ‌స్తున్న కొద్దీ ప్ర‌తి ప‌నీ సులువైపోతుంది.  ఇంట్లో నుంచే అన్ని ప‌నులూ చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం.  మోస‌గాళ్లు కూడా సేమ్ ఇదే ఫీల‌వుతున్నారు.  ఎందుకంటే వాళ్ల‌కు కూడా ఇదివ‌ర‌క‌టిలా శ్ర‌మ ప‌డాల్సిన ప‌ని ఉండ‌టం లేదు. జ‌స్ట్ కాస్త తెలివి ఉంటే చాలు జ‌నాన్ని బుట్ట‌లో వేసి  డ‌బ్బులు కొట్టేస్తున్నారు.  బెంగ‌ళూరులో ఓ టెకీ నుంచి ఇలాగే 64 వేల రూపాయ‌లు కొట్టేశాడో మోస‌గాడు. అదేంటో చూద్దాం.. 

ఏం జ‌రిగింది? 
బెంగ‌ళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కెన‌డాలో ఉంటున్న త‌న భ‌ర్త‌కు ఓ కొరియ‌ర్ పంపాల‌నుకున్నారు. కొరియ‌ర్ నెంబ‌ర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటే ఆమెకో నెంబ‌ర్ క‌నిపించింది. ఆ నెంబ‌ర్‌కు కాల్ చేస్తే తాను ఫెడెక్స్ ఏజెంట్‌న‌ని వ్య‌క్తిన‌ని చెప్పుకున్నాడు.త‌న సూచ‌న‌ల‌ను పాటిస్తూ వెళితే కొరియ‌ర్ ప్రాసెస్ పూర్తవుతుంద‌ని న‌మ్మించాడు. దాన్ని న‌మ్మి ఆమె అలాగే చేశారు. అయితే ఆ ప్రాసెస్‌లో అత‌ను చెప్పినట్లే చేయ‌గా అది ఆమె గూగుల్ పే అకౌంట్‌ను క్యాచ్ చేసింది. వెంట‌నే ఆరు ద‌ఫాలుగా మొత్తం 63,900 రూపాయ‌లు ఆ టెకీ అకౌంట్‌లో నుంచి కొట్టేశారు. 

ఎలా జ‌రిగింది?
కొరియ‌ర్ ఏజెంట్‌న‌ని చెప్పిన వ్య‌క్తి పంపిన ఓ లింక్‌ను టెకీ క్లిక్ చేశారు. అది నేరుగా గూగుల్ పే అకౌంట్‌కు లింక్ అయి ఉండ‌డంతో ఆమె అకౌంట్‌లో నుంచి మ‌నీ తీసుకోవ‌డానికి వాళ్ల‌కు యాక్సెస్ ఇచ్చిన‌ట్ల‌యింది. 

ఇలాంటి ఫ్రాడ్స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే..
* అన్నింటికీ గుడ్డిగా గూగుల్‌ను న‌మ్మొద్దు. 

* ముఖ్యంగా ఏదైనా క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేయాల‌నుకున్న‌ప్పుడు ఆ సంస్థ అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్క‌డి నుంచి నెంబ‌ర్ తీసుకుని కాల్ చేయండి. 

* లేదంటే ఆ సంస్థ మొబైల్‌ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే నేరుగా క‌స్ట‌మర్ కేర్‌ను కాంటాక్ట్ చేసే ఆప్షన్లు ఉంటాయి.

* ఎవ‌రైనా తెలియ‌ని వ్య‌క్తి ఫ‌లానా యాప్ డౌన్‌లోడ్ చేయ‌మ‌ని లేదా ఫ‌లానా లింక్ క్లిక్ చేయ‌మ‌ని అడిగితే చేయ‌కండి. 

కొరియ‌ర్ మోసం ఆన్‌లైన్ ఫ్రాడ్‌ గూగుల్ పే ఫ్రాడ్‌ online fraud cyber crime