• తాజా వార్తలు

వైర్ లెస్ కెమెరా ల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిన భావనగర్

గుజరాత్ లోని అత్యంత ప్రాచీన మరియు చారిత్రాత్మక నగరాలలో భావ నగర్ ఒకటి. ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతం ఖంబట్ గల్ఫ్ కు పడమట దిక్కులో ఉంటుంది. ఈ నగరం యొక్క మూలాలు 17 వ శతాబ్దం లోనే మొదలు అయ్యాయి. అంతేగాక స్వాతంత్ర్యం వచ్చే వరకూ ఇది ఒక పెద్ద మరియు అందమైన నగరంగా ఉండేది.

ఏది ఏమైనప్పటికీ దేశం లోని మిగతా నగరాల్లాగే ఈ నగరం కూడా ఇప్పుడు అతి వేగంగా విస్తరిస్తుంది. అలా  విస్తరిస్తూ ఆసియా లోనే అతి పెద్ద షిప్ బ్రేకింగ్ యార్డ్ అయిన అలంగ్ కు దగ్గరగా వచ్చేస్తుంది. గడచిన కొన్ని దశాబ్దాలలో ఈ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందింది. ప్రస్తుతం ఈ నగర జనాభా 8 లక్షల వరకూ ఉంది.

నగర సమస్యలు

ఒక వైపు నగరం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ది వేగంగా దూసుకు పోతుంటే మరొక వైపు అక్రమ వ్యాపారం, స్థానిక నేరాలు, కొరవడిన భద్రత లాంటి అంశాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి.పోలీసు వారు చెబుతున్న దాని ప్రకారం ఈ సమస్యలను తక్షణమే  పరిష్కరించడం అనేది వెంటనే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం లో  ఏమంత అలసత్వం ప్రదర్శించినా అది వ్యతిరేక ప్రభావాలు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలు పూర్తీ గా తొలగి పోవాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరైన మార్గమనే నిర్ణయానికి జిల్లా పోలీసులు వచ్చేశారు. ఈ సమస్యలన్నింటినీ మూలాలతో సహా పెకిలించి వేయడానికి వైర్ లెస్ కెమెరా ల ద్వారా పటిష్ట నిఘా ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు.

టెక్నాలజీ  పరిష్కారం

నగరం మొత్తాన్నీ నిరంతరం పర్యవేక్షించే ఈ నిఘా వ్యవస్థను 2014 లోనే జిల్లా పోలీసు డిపార్టుమెంటు ప్రతిపాదించింది.ఆ తర్వాత  నాలుగు అయిదు నెలల్లో అహమదాబాద్ కి చెందిన ఒక ఏజెన్సీ కి ఈ బాధ్యతను అప్పగించారు. టెండర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ను వారికి ఇవ్వనున్నారు. హార్డ్ వేర్ పరికరాలు, ఫైబర్ నెట్ వర్క్ మిగతా పరికరాలకు అయ్యే మొత్తం ఖర్చు ను అంచనా వేసి ఈ ఏజెన్సీ పోలీసు వారికి సమర్పించింది. వారు చెబుతున్న దాని ప్రకారం ఈ ప్రాజెక్ట్ యొక్క అంచానా వ్యయం సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుంది.

మొదటి దశ.

ఈ ఏజన్సీ యొక్క బ్లూ ప్రింట్ ప్రకరం ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ గత సంవత్సరం మే నెలలోనే ప్రారంభం అయింది. నగరం లోని ముఖ్య ప్రదేశాలు అయిన  ప్రవేశ మరియు నిర్గమ ద్వారాలలో సుమారు 25 లక్షల ఖర్చ్గుతో 32 CCTV లను ఏర్పాటు చేసారు. స్థానిక అథారిటీ  ల పర్యవేక్షణ లో ఈ ప్రాజెక్ట్ ఉండడం వలన ప్రజలనుండి పెద్ద ఎత్తున స్పందన మరియు సహకారాలు లభించాయి. మొదటి దశకు అయ్యిన బడ్జెట్ స్థానిక రాజ్య సభ MP యొక్క MP ల్యాడ్స్ నిధుల నుండి కేటాయింపు జరిగింది.  ఆ తర్వాత ప్రజల నుండీ స్థానిక సంస్తలనుండీ వచ్చిన  అనూహ్యమైన స్పoదన తో ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యాయం 1.10 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. వీటిలో నగర మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 51  మంది కార్పొరేటర్ లు  51  లక్షలు స్వచ్చందం గా ఇచ్చారు. మొదటి దశ లో వచ్చిన ఈ స్పందన తో ఉత్సాహం గా ఉన్న పోలీసులు అదే ఉత్సాహం లో రెండవ దశను కూడా మొదలు పెట్టాలని సంకల్పించారు. కానీ ఈ సారి బడ్జెట్ రెండున్నర కోట్లు.

భావనగర్ జిల్లా పోలీసులు గుజరాత్ ముఖ్యమంత్రి ని ఈ ప్రాజెక్ట్ కు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారు. అడిగిన వెంటనే ఏ  మాత్రం ఆలస్యం చేయకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు నిధులు మంజూరు చేసింది.

రెండవ దశ :-

ఈ ప్రాజెక్ట్ యొక్క రెండవ దశలో నగర వ్యాప్తంగా రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్, ఎయిర్ పోర్ట్, హాస్పిటల్ లు, బ్యాంకు లు, స్కూల్ లు, కాలేజీ లు లాంటి ప్రదేశాలలో  తో పాటు సామాజికంగా సున్నితంగా ఉండే ప్రదేశాలలో కూడా  సుమారు 59 ప్రదేశాలలో 155 CCTV కెమెరా యూనిట్ లను అమర్చారు. ఈ ప్రాజెక్ట్ కు సహకరించిన సంస్థ పేరు పేరు ESEC సెక్యూరిటీ కన్సల్టెంట్స్. ఈ సంస్థ CCTV లను ఇన్స్టాల్ చేయడం తో పాటు వాటికి కమాండ్ సెంటర్ లను కూడా ఏర్పాటు చేసింది. వీటిలో 98 శాతం వరకూ వైర్ లెస్ వ్యవస్థలే. ఒక రెండు శాతం మాత్రం ఫైబర్ నెట్ వర్క్ తో ఉంటాయి. గత ఫెబ్రవరి కల్లా ఈ రండవ దశ కూడా పూర్తీ అయి ప్రస్తుతం విజయ వంతంగా నడుస్తుంది.

ఈ వైర్ లెస్ CCTV నిఘా వ్యవస్థ ద్వారా భావనగర్ పోలీసులు తమ జిల్లా ను దేశం లోనే ఆదర్శవంతంగా నిలిపారు. చిన్న చిన్న నగరాలు కూడా  స్వయం సహాయం తో అత్యాధునిక టెక్నాలజీ ని ఎలా ఉపయోగించుకోవచ్చో చేసి చూపించారు.

హ్యాట్సాఫ్ టు  భావనగర్ పోలీస్

జన రంజకమైన వార్తలు