• తాజా వార్తలు

షియోమి, శాంసంగ్‌, పిక్స‌ల్ ఫోన్ల‌ను ఇలా హ్యాక్ చేస్తున్నారు..త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

హ్యాకింగ్‌.. టెక్నాల‌జీ గురించి ఐడియా ఉన్న వాళ్ల‌కు ఈ ప‌దం గురించి ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. మ‌న అనుమ‌తి లేకుండా.. మ‌న‌కు తెలియ‌కుండా మ‌న సిస్ట‌మ్స్‌లో  చొర‌బ‌డి విలువైన స‌మాచారాన్ని త‌స్క‌రించే ప్ర‌క్రియే హ్యాకింగ్. ఒక‌ప్పుడు ఇది కేవ‌లం కంప్యూట‌ర్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేది. కానీ ఫోన్ల‌లో కూడా ఇంట‌ర్నెట్ వచ్చేయ‌డంతో ఇప్పుడు ఫోన్లు కూడా హ్యాకింగ్ బారిన ప‌డుతున్నాయి. తాజాగా షియోమి, శాంసంగ్‌, గూగుల్ పిక్స‌ల్ ఫోన్లు ఇలా హ్యాక్ అవుతున్నాయంట‌.. మ‌రి అవి ఎలా హ్యాక్ అవుతున్నాయో.. మ‌నం ఏం చేయాలో చూద్దామా..!

ఎలా చొర‌బ‌డుతున్నాయంటే..
ఇటీవ‌ల గూగుల్‌కు చెందిన మిడిల్ స్టోన్ రీసెర్చ్ సెక్యూరిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గూగుల్ ఫోన్ల‌లో ఎక్కువ శాతం సైబ‌ర్ దాడుల‌కు గుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌. కొన్ని వాల్యున‌బిలిటీ ఉన్న ఫోన్ల‌ను అటాక్ చేయ‌డానికి హ్యాక‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ట‌.  లోక‌ల్ లెవ‌ల్లో మాత్రమే ఇలా హ్యాక‌ర్లు ఫోన్ల‌లో ప్ర‌వేశించేందుకు అవ‌కాశం ఉంద‌ట‌. ఇది కొన్ని ఫిజిక‌ల్ సోర్పుల ద్వారా ఇంజెక్ట్ చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే ఈ వైర‌స్‌లు ఫోన్ల‌లోకి వెళుతున్నాయ‌ట‌. 

ఏం చేయాలి?
కేవ‌లం గూగుల్ ఫోన్లు మాత్రమే కాదు శాంసంగ్‌, షియోమికు సంబంధించిన ఫోన్ల‌లో సైతం హ్యాకింగ్‌కు అనుకూలంగా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయ‌ని ఇవి ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. త‌మ‌కు తెలియ‌కుండానే కొన్ని ఏజెన్సీలు ఈ ఫోన్ల‌ను వాడుకుంటున్నాయ‌ని ఇది ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని వారి మాట‌. అందుకే ఇలాంటి ఫోన్ల‌లో ఎలాంటి వైర‌స్‌ల‌నైనా త‌ట్టుకునే మాల్‌వేర్ అప్లికేష‌న్ల‌ను ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసుకోవాల‌ని వారు చెబుతున్నారు. ప్ర‌తి అప్‌డేట్‌లోనూ యాంటీ మాల్‌వేర్ అప్లికేష‌న్లు అప్‌డేట్ కావాల‌ని చెప్పారు. పిక్స‌ల్ 1, 2 ఫోన్ల‌లో ప్ర‌స్తుతానికి ఈ అప్‌డేట్స్ ఉన్నాయ‌ని.. మిగిలిన ఫోన్లు కూడా ఇదే ప్ర‌మాణాలు పాటించాల‌ని వాళ్లు చెబుతున్నారు. 

జన రంజకమైన వార్తలు