• తాజా వార్తలు

ఇక‌పై ఉబెర్ క్యాబ్స్‌లో మ‌నం మాట్లాడుకునేది.. రికార్డ్ అవ‌నుందా?

 

క్యాబ్‌లు వచ్చాక ప్ర‌యాణం సులువుగా, సుఖంగా జ‌రిగిపోతోంది. కానీ క్యాబ్స్ ఇచ్చే అగ్రిగేటర్స్ ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ల భ‌ద్ర‌త‌కోసం అంటూ టెక్నాల‌జీని మ‌రీ మ‌న ప్రైవ‌సీని హ‌రించేలా తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.  తాజాగా ఉబెర్ త‌న క్యాబ్ రైడ్స్‌లో ఆడియోను రికార్డ్ చేస్తామంటూ ప్ర‌క‌టించ‌డం ప్రైవ‌సీపై ప్రభావం చూసేలా క‌నిపిస్తోంది. 
యూఎస్‌లో ప్రారంభిస్తార‌ట  
ఉబెర్ త‌న ప్యాసింజ‌ర్ రైడ్స్‌లో ఆడియో రికార్డింగ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  మెక్సికో, బ్రెజిల్‌లో దీన్ని టెస్ట్ చేశామ‌ని, త్వ‌ర‌లో యూఎస్‌లో ఈ ఫీచ‌ర్‌ను ఉబెర్ ఫ్లాట్‌ఫాంపైకి తీసుకొస్తామ‌ని అనౌన్స్ చేసింది. 
ఇప్ప‌టికే ప్రైవ‌సీ పోతోంది
ఇప్ప‌టికే టాక్సీ అగ్రిగేట‌ర్ యాప్స్ ద్వారా మ‌న ప్రైవ‌సీకి ఎంతో కొంత రివీల్ అవుతుంద‌నే చెప్పాలి. ఎందుకంటే మ‌నం  ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళుతున్నామో ఇందులో రికార్డ్ అవుతుంది. మ‌న హోం, ఆఫీస్ అడ్ర‌స్‌లు సేవ్ అవుతాయి. కొంత‌మంది పేమెంట్ చేయ‌డానికి ఈజీగా ఉంటుంద‌ని త‌మ క్రెడిట్ కార్డ్ డిటైల్స్ కూడా ఉబెర్‌, ఓలా లాంటి యాప్స్‌లో సేవ్ చేసి ఉంచుతారు. అంతేకాదు మ‌నం రైల్వేస్టేష‌న్‌కు వెళ్లామా, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లామా కూడా అగ్రిగేట‌ర్ యాప్స్‌లో సేవ్ అవుతుంది. దీన్ని ఎవ‌రైనా దొంగ‌లు హ్యాక్ చేస్తే ప్ర‌మాదం క‌దా.  
రికార్డింగ్ చేయొచ్చా?
ఇప్ప‌టికే ఇన్ని ర‌కాలుగా మ‌న ప్రైవ‌సీకి ఈ యాప్స్‌తో డేంజ‌ర్ ఉంది. కొత్త‌గా రైడ్‌లో మ‌న మాట‌ల్ని కూడా రికార్డింగ్ చేస్తే ఇక క్యాబ్‌లో కూడా ధైర్యంగా మాట్లాడుకోలేని ప‌రిస్థితి వ‌స్తుంది. ఎందుకంటే మ‌నం ఎక్క‌డికి వెళుతున్నామో, ఎవ‌రిని క‌ల‌వ‌బోతున్నామో ప్ర‌యాణించేట‌ప్పుడు ఫ్రెండ్స్‌తోనో, ఇంట్లోవాళ్ల‌తోనే చెప్పుకుంటాం. అలాగే మ‌నీ మ్యాట‌ర్స్, ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా డిస్క‌స్ చేస్తుంటాం. ఇవ‌న్నీ రికార్డ్ అవుతాయి. వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు రికార్డ్ చేసే అధికారం కొన్ని ప్ర‌భుత్వ ఏజెన్సీల‌కు  మాత్ర‌మే ఉంది. అది కూడా గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్ తీసుకున్నాకే చేయాలి. సేఫ్టీ పేరుతో ఇలా ప్ర‌యాణికుల మాట‌లు రికార్డ్ చేయ‌డం క‌రెక్ట్ కాదన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.  ఈ రికార్డింగ్ సేఫ్టీ కోస‌మేన‌ని,  ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగితే ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి మాత్ర‌మే దీన్ని ఉప‌యోగిస్తామ‌ని ఉబెర్ చెబుతోంది. డ్రైవ‌ర్‌, ప్యాసింజ‌ర్ త‌మ కాల్స్ రికార్డ్ చేసేలా మైక్రోఫోన్ యాక్సెస్  ఉబెర్ సెట్టింగ్స్‌లో ఇస్తేనే  రైడ్‌లో వారి మాట‌ల‌ను రికార్డ్ చేయ‌గ‌ల‌మ‌ని ఉబెర్ చెబుతోంది. అయితే దీన్ని త‌ర్వాత ఉబెర్ ఉద్యోగులు కూడా యాక్సెస్ చేసే ప్ర‌మాదం ఉంద‌న్న ఆందోళ‌న యూజ‌ర్ల‌లో  ఉంది. 
 

జన రంజకమైన వార్తలు