హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద హ్యాకింగ్ జరిగింది. అడిడాస్ యొక్క US వెబ్ సైట్ నుండి ఒక అన్ ఆథరైజ్డ్ పార్టీ ఒకటి కస్టమర్ ల యొక్క డేటా ను తస్కరించినట్లు అడిడాస్ కనిపెట్టింది. తన కస్టమర్ లను కూడా ఈ హ్యాకింగ్ విషయమై అప్రమత్తం చేసింది. ఇలాంటివి ఎన్నో ప్రతీ రోజూ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన డేటా విషయం లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన డేటా హ్యాక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉండేది వీక్ పాస్ వర్డ్ ల విషయం లో. అవును మనలో చాలా మంది సౌలభ్యం కోసమనో లేక ఫ్యాషన్ కోసమో తెలియదు గానీ చాలా బలహీనం గా ఉండే పాస్ వర్డ్ లు సెట్ చేసుకుంటారు. అలాగే కొన్ని కామన్ పాస్ వర్డ్ లు కూడా హ్యాకర్ లకు సులభంగా చిక్కుతాయి. ఈ నేపథ్యం లో అత్యంత ప్రమాదకరమైన 100 పాస్ వర్డ్ ల లిస్టు ను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఈ రోజు ఆర్టికల్ లో ఇస్తున్నాం.