స్మార్ట్ ఫోన్ లు మరియు నిఘా వ్యవస్థల రూపం లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ టచ్ ఇండస్ట్రీ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యం లో ఈ టెక్నాలజీ ని మరింత విస్తృతంగా నూ మరియు సమర్థవంతంగానూ ఉపయోగించుకోవాలి అని చెన్నై పోలీసులు నిర్ణయించుకున్నారు. ఫేస్ టాగర్ యాప్ ద్వారా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ దీనిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిద్వారా అంతరాష్ట్రీయ దొంగల కదలికలను కనిపెట్టి వారిపై నిఘా ఉంచే అవకాశం ఉంటుంది.
పుదుచ్చేరి క్రైమ్ రికార్డు బ్యూరో తమ రాష్ట్రానికి చెందిన క్రిమినల్ డేటా ను అందజేసింది. మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణా కూడా తమ తమ రాష్ట్రాలకు చెందిన క్రిమినల్ ల యొక్క సమాచారాన్ని ఇవ్వవలసి ఉంది. ప్రస్తుతానికి వీరి దగ్గర సుమారు 67,000 లకు పైగా క్రిమినల్ లకు చెందిన సమాచారం ఉన్నది. ఈ సమాచారం తో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రిమినల్ లను కనుగొనే వీలు ఉంది.
పోలీసులకు ఎవరైనా అనుమానాస్పదం గా అనిపిస్తే ఈ యాప్ ద్వారా వారి ఫోటో తీసి ఆ ఫోటో ను స్కానింగ్ చేస్తారు. వారిదగ్గర ఉన్న డేటా లో ఎవరితోనైనా ఈ ఫోటో మ్యాచ్ అయితే ఈ యాప్ వెంటనే చెప్పేస్తుంది. ఆ వ్యక్తి ఎవరూ, అతని నేర చరిత్ర ఏమిటి? అతని పై ఏ ఏ స్టేషన్ లలో ఏ ఏ కేసు లు రిజిస్టర్ అయి ఉన్నాయి? తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత పోలీసులు వారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు.
ఈ ఫేస్ టగర్ యాప్ మొట్టమొదటిసారిగా 2017 అక్టోబర్ లో తమిళనాడు, చెన్నై లోని టి నగర్ పోలేసు స్టేషన్ లో ఉపయోగించబడింది. అప్పుడు ఇందులో 12,000 మంది క్రిమినల్ లకు చెందిన డేటా ఉంది. ప్రస్తుతానికి అయితే తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రభుత్వాల మధ్యనే క్రిమినల్ ల డేటా షేరింగ్ అనేది జరుగుతుంది. అతి త్వరలోనే మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇందులో పాలు పంచుకోనున్నాయి. రెండు రాష్ట్రాల లోని 12 పోలీసు జిల్లాలలో 10 జిల్లాలు ఈ టెక్నాలజీ ని ఉపయోగించుకుంటున్నాయి.
తమిళనాడు లోని అందరు బీట్ పోలీసులకు ఈ టెక్నాలజీ కి సంబందించిన యాక్సెస్ ఇవ్వబడింది. తమిళనాడు లోని వాషర్ మాన్ పేట్ జిల్లా లో ఇది చాలా సమర్థవంతం గా ఉపయోగించబడుతుంది.