int(5230)
స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో చాలామందికి ‘యూపీఐ’గా పరిచయమైన ‘యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్’ వల్ల నగదు రహిత చెల్లింపులు సులభమయ్యాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఒక వ్యక్తి ‘యూపీఐ’ తెలిస్తే మనం ఇంకా బ్యాంకు నంబరు, పేరు, ఊరు లాంటి వివరాలతో అవసరం లేకుండానే నేరుగా అతని బ్యాంకు ఖాతాలో సొమ్ము జతచేయడం సాధ్యమవుతోంది. ‘యూపీఐ’ అనేది ఒక ఇ-మెయిల్ ఐడీలాంటిదే కనుక ప్రసిద్ధమైన ‘యూపీఐ’లకు నకిలీలు తయారు చేసి అమాయకులను మోసం చేయడానికి వాడుకొనే స్కాములు అనేకం ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా కోవిడ్-19 పై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్’ నిధికి సంబంధించిన ‘యూపీఐ’కి కూడా నకిలీల బెడద తప్పడం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.
వారు విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం పీఎం కేర్స్ నిధి అసలైన ‘యూపీఐ’ pmcares@sbi కాగా pmcare@sbi పేరుతో నకిలీ ‘యూపీఐ’ని ప్రచారంలోకి తెచ్చి ప్రజలని మోసగించే పని జరుగుతోంది. నకిలీ ‘యూపీఐ’లో ఒక అక్షరం “s” తక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. ప్రస్తుతం బయటపడింది ఇదే అయినా ఇంకా ఇలాగే ఒకటి రెండు అక్షరాల తేడాతో మరిన్ని నకిలీలో చలామణీలేవని చెప్పలేం కదా. కనుక అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.
పీఎం కేర్స్ నిధికి కానీ, మరే ఇతర నిధికి కానీ విరాళాలు అడుగుతూ ఎలాంటి ఎస్సెమ్మెస్‌లూ వాట్సప్ సందేశాలు, ట్విట్టర్, ఫేస్‌బుక్ మెసేజులు వచ్చినా వాటిలోని ‘యూపిఐ’ లింకుల మీద గుడ్డిగా క్లిక్ చేయకుండా వాటిని అధికారిక వెబ్‌సైటులు, పేజీలలోని ‘యూపీఐ’ ఐడీతో పోల్చుకుని మాత్రమే చెల్లింపులు చేయడం మంచిది.
pm cares fake upi fraudsters SBI నకిలీ యూ పీ ఠపీ à°Žà°‚ కేరà±à°¸à± సైబరౠనేరగాళà±à°²à°¤à±‹ జాగà±à°°à°¤à±à°¤