• తాజా వార్తలు

కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్‌కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో  కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. టెక్సస్‌లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు. వీరు తెలిపిన విషయాల ప్రకారం మొబైల్, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఏదైనా సరే మీ కీబోర్డుపై టైపింగ్ చేసే పాస్‌వర్డ్ సౌండ్ వింటే చాలు. వెంటనే వారు మీ పాస్‌వర్డ్‌ను పసిగట్టేస్తారు. 

శబ్ద తరంగాల (sound waves)ద్వారా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్‌తో విజయవంతంగా passwordను డికోడ్ చేయగలరని పేర్కొన్నారు. మొబైల్లో ఓ మైక్రోఫోన్ ఆధారంగా పాస్ వర్డ్ సౌండ్‌ను ఈజీగా గుర్తించగలరని రీసెర్చర్లు తమ పరీశోధనలో వెల్లడించారు. ఈ మెథడ్ ద్వారా యూజర్ల పాస్ వర్డ్ ఈజీగా crack చేయడమే కాదు.. సదరు వ్యక్తి ఈమెయిల్స్ లేదా మెస్‌జ్‌లు కూడా చూడవచ్చు. ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్‌పై టైప్ చేస్తున్న పదాలను హ్యాకర్లు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఏమి టైపింగ్ చేస్తున్నాడో కూడా శబ్ద తరంగాల ద్వారా గుర్తించగలరు. 

తాము హ్యాకింగ్ కు గురవుతున్నామనే విషయం కూడా సదరు వ్యక్తికి ఎలాంటి ఆధారం ఉండదని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా హ్యాక్ చేయాలంటే ఆన్ లైన్ యూజర్లు టైప్ చేసే డివైజ్ దేనితో తయారుచేశారో ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా మెటల్ లేదా ప్లాస్టిక్ డివైజ్ నుంచి వచ్చే సౌండ్ ప్యాటరన్ ను హ్యాకర్లు అర్థం చేసుకోగలరని వారు అంటున్నారు. ఈ సీన్ చూస్తుంటే మనకు నాన్నకు ప్రేమతో సినిమా గుర్తుకు వస్తుంది కదా. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్ విలన్ పాస్‌వర్డ్‌ను ఈ విధంగానే గెస్ చేసి హ్యాక్ చేస్తాడు. అందమైన పెయింటింగ్ లో సీక్రెట్ కెమెరా పెట్టి విలన్ పాస్‌వర్డ్ టైప్ చేస్తుండగా క్షణాల్లో హ్యాక్ చేస్తాడు.
 

జన రంజకమైన వార్తలు