కిరాణా సరకులు, నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే ఇంటికి చేర్చే జియో మార్ట్ సేవలను రిలయన్స్ రిటైల్ మార్ట్ కొంతకాలం క్రితం ప్రయోగాత్మకంగా ముంబయిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది. అక్కడ సక్సెస్ అవడంతో ఎక్స్‌టెండెడ్ బీటా వెర్షన్ కింద తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల తాజాగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 29 నగరాల్లో జియో మార్ట్ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నగరాల్లో ప్రజలు కిరాణా సరుకులను జియోమార్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా తెప్పించుకోవచ్చు. తన వినియోగదారులకు ఎంఆర్‌పీ కంటే 5 శాతం తక్కువ ధరకే జియోమార్ట్ ఉత్పత్తులను అందిస్తుంది.
ఏపీలో ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్‌లోని 16 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
1. విశాఖపట్నం
2. విజయనగరం
3. కాకినాడ
4. రాజమహేంద్రవరం
5. భీమవరం
6. తణుకు
7. తాడేపల్లిగూడెం
8. విజయవాడ
9. ఉయ్యూరు
10. గుంటూరు
11. నరసరావుపేట
12. వినుకొండ
13. చిత్తూరు
14. తిరుపతి
15. కర్నూలు
16. అనంతపురం
తెలంగాణలో ఎక్కడ?
1. హైదరాబాద్
2. వరంగల్
3. కరీంనగర్
4. నిజామాబాద్
5. బోధన్
6. మహబూబ్‌నగర్
7. నల్గొండ
8. మిర్యాలగూడ
9. ఖమ్మం
10.పాల్వంచ
11. మెదక్
12. సంగారెడ్డి
13. సిద్ధిపేట