అవసరం అన్వేషణకు తల్లిలాంటిది అంటారు. కరోనా వేళ కంపెనీలన్నీ ఇలాగే ఆలోచిస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం అత్యధిక సెల్‌ఫోన్లు అమ్ముతున్న చైనా కంపెనీ షియోమీ కూడా ఇలాగే ఆలోచించింది. లాక్‌డౌన్‌తో ఇండియాలో షాపులన్నీమూసేశారు. సెల్‌ఫోన్ అమ్మే దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో ఫోన్ల అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో తన ప్రొడక్ట్స్ కస్టమర్లకు చేర్చడానికి తానే సొంతంగా ఈకామర్స్ కంపెనీ పెట్టుకోవాలని షియోమి నిర్ణయించింది.
ఎంఐ కామర్స్
ఎంఐ కామర్స్ పేరుతో ఈ కొత్త సర్వీస్‌ను షియోమి ఈ వారంలోనే ప్రారంభించబోతోంది. దీని ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేస్తే ప్రొడక్ట్ అందిస్తుంది. ఇది సక్సెస్ అయితే కనుక లాక్డౌన్ తర్వాత కూడా కొనసాగిస్తామని షియోమి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్ చెప్పారు.
30% వాటా
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 30% వాటా షియోమిదే. ఇండియాలో అత్యధిక ఫోన్లు అమ్ముతున్న కంపెనీగా ఏడాది కిందటే
షియోమి శాంసంగ్‌ను నెట్టేసి ముందుకొచ్చింది. లాక్డౌన్‌తో అన్ని కంపెనీల ఫోన్ల అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో అత్యధిక ఫోన్లు అమ్మే కంపెనీగా షియోమి అందరికంటే ఎక్కువ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐ కామర్స్ పేరిట సొంతంగా ఈకామర్స్ కంపెనీయే పెట్టాలని నిర్ణయించింది.