అటులయిన పోయి రావలె హస్తినకు.. మహాభారతం ఆధారంగా వచ్చిన సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీలూ ఇదే పాట ఎత్తుకోబోతున్నాయంట. ఎలాగయినా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లోకి వెళ్లాలన్న టార్గెట్‌తో కంపెనీలు కొత్తకొత్త బిజినెస్ ట్రిక్స్ ప్లే చేసేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణ ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్ . దాని కథ చూద్దామా.
పల్లెకే ఫోన్
మన దేశంలో ఇప్పటికీ 65% పల్లెలే. వాళ్లు సెల్లు కొనుక్కోవాలంటే టౌన్‌కి రావాలి. అలా ఎందుకు మనమే ఆ పల్లెకు పోతే పోలా అనేదే ఈ ఎంఐ ఆన్ వీల్స్ కాన్సెప్ట్. విలేజ్‌లకు వెహికల్ వేసుకుని వెళ్లిపోయి ఫోన్లు అమ్ముకునే కొత్త మార్కెట్ స్ట్రాటజీ. చత్తీస్‌గడ్‌లోని మహ్సాముండ్‌లో ఈ ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్‌ను ప్రారంభించారు.
ఫోన్లే కాదు టీవీలు, పవర్‌బ్యాంక్‌లు అన్నీ
ఈ ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్‌లో ఎంఐ, రెడ్‌మీ ఫోన్లు మాత్రమే కాదు. పవర్‌బ్యాంకులు, ఇయర్ ఫోన్లు, ఎంఐ టీవీ స్టిక్‌లు, ఎంఐ టీవీలు కూడా అమ్ముతున్నట్లు ఎంఐ ఇండియా ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్ చెబుతున్నారు. త్వరలోనే దేశమంతా ఇలాంటి ఎంఐ స్టోర్ ఆన్ వీల్స్ నడుపుతామని ఆయన చెబుతున్నారు.