ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన తర్వాత కేంద్ర హోం శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. డిజిటల్ ఎకానమీ అనేది ప్రభుత్వ రంగంలో చాలా కీలకమైనది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, ఐటీ, ప్రభుత్వ కార్యకలపాల కోసం పని చేసే డేటా, కాల్ సెంటర్లు, ఆన్‌లైన్ టీచింగ్, దూరవిద్య తదితర కార్యకలపాలకు అనుమతి ఉంటుంది అని ఏప్రిల్ 16న ప్రకటించింది. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లన్నీ సంతోషపడ్డాయి. ఉప్పులూ, పప్పులూ ఎన్నాళ్లని అమ్ముతాం. స్మార్ట్‌ఫోన్లు, ఎలాగూ సమ్మర్ కాబట్టి ఏసీలు, టీవీలు లాంటి వి అమ్మితే కాస్త బిజినెస్ కుదుటపడుతుంది అనుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అయితే ఏప్రిల్ 20 తర్వాత స్మార్ట్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఆర్డర్లు తీసుకుంటామని ప్రకటించింది కూడా. అయితే నిన్న కేంద్రం చేసిన ప్రకటన ఈకామర్స్ కంపెనీలను ఉసూరుమనిపించిది.
నో రిలాక్సేషన్
లాక్‌డౌన్ ముగిసే మే 3వ తేదీ వరకూ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర హోంశాఖ ఈకామర్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే ఇది ఆటోమేటిగ్గా ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు వంటి నిత్యావసరేతర వస్తువులన్నింటికీ వర్తిస్తుందని చెప్పినట్లే. ఆహారం, ఔషధాలు, ఔషధ పరికరాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉందని.. ఈ-కామర్స్ విక్రయదారుల వాహనాలకు అనుమతి తప్పనిసరి అని కేంద్రం ఆర్డర్స్ ఇచ్చేసింది.
నిరాశే.. కానీ తప్పదన్న కంపెనీలు
* ఈకామర్స్ టాప్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రకటనపై ఎలాంటి స్పందనా ప్రకటించలేదు.
* షియెమి ఇండియా ఎండీ మనూజైన్ మాట్లాడుతూ.. మేం ఈ ప్రకటనను పరిశీలిస్తున్నాం. త్వరలోనే అప్‌డేట్ చేస్తాం. ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న సూచనలను అందరూ తప్పక పాటించాలి అన్నారు.
* మేం నార్జో సిరీస్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్లు 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనుకున్నాం. కానీ ప్రభుత్వం ఇప్పుడే ఈకామర్స్ కంపెనీల ద్వారా మే 3 వరకు ఫోన్ల విక్రయాలు వద్దని చెప్పడంతో మా నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నామని రియల్‌మీ స్పోక్స్‌పర్సన్ ప్రకటించారు.
* ప్రభుత్వ నిర్ణయం చాలా కష్టమైనదని టెక్నోపాక్ అనే రిటైల్ కన్సల్టెంట్స్ గ్రూప్ ఛైర్మన్ అర్వింద్ సింఘాల్ అన్నారు.
* ప్రభుత్వ ప్రకటన వర్క్ ఫ్రం హోం చేస్తూ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందికి నిరాశ కలిగించింది. మేం 48 గంటల్లోనే ఇలాంటి వారికి కావల్సిన సరకులు సరఫరా చేయడానికి సిద్ధమయ్యాం. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న వ్యాపారులు, తయారీదారులకు నిరాశే మిగిలిందని అమెజాన్ ఇండియా స్పోక్స్‌పర్సన్ అన్నారు.
* టీసీఎల్ ఇండియా జనరల్ మేనేజర్ మైక్ చెన్ మాట్లాడతాం పరిస్థితిని గవర్నమెంట్ నిర్ణయం ప్రకటిచింది. ఇది మాలాంటి కంపెనీలకు నిరాశ కలిగించినా తప్పదు. ప్రభుత్వం మా మీద దయ చూపిస్తుందని భావిస్తున్నామన్నారు.