• తాజా వార్తలు

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు క్యాష్ ఎట్ హోమ్ స‌దుపాయం తీసుకొచ్చిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ‌యోవృద్ధుల‌కు శుభ‌వార్త చెప్పింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు క్యాష్ ఎట్ హోమ్ స‌దుపాయాన్ని క‌ల్పించింది. క‌రోనా వైర‌స్ ఉద్ధృతి నేప‌థ్యంలో వృద్ధులు బ‌య‌టికి వెళ్ల‌వ‌ద్దని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ త‌న ఖాతాదారులైన వృద్ధులకు ఇంటివ‌ద్దకే డ‌బ్బులు తెచ్చి అందిస్తామని ప్ర‌క‌టించింది.  

ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌వారికే 
ప్ర‌స్తుతం ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో వృద్ధులకు, వికలాంగులకు క్యాష్ ఎట్ హోం సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు పేటీఎం ప్ర‌క‌టించింది.  త్వ‌ర‌లో మిగ‌తా ప్రాంతాల‌కూ వ‌ర్తింప‌జేసే అవ‌కాశం ఉంది.

ఎలా వాడుకోవాలి?
* పేటీఎం పేమెంట్ బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్నవారు తమ మొబైల్‌లో  పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. 

* తమ ఖాతా నుంచి ఎంత  మొత్తం డ్రా చేయాల‌నుకుంటున్నారో ఎంట‌ర్ చేయాలి.

* రెండు రోజుల్లోగా ఆ మొత్తాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఆ ఖాతాదారులైన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అంద‌జేస్తారు.

* కనీసం 1000 రూపాయ‌లు, మ్యాగ్జిమం 5వేల రూపాయ‌ల వ‌ర‌కు ఇలా ఇంటికే తెప్పించుకోవ‌చ్చు.

* పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు ఖాతాదారు ఇచ్చిన ఇంటి అడ్ర‌స్‌కు ఈ మొత్తాన్ని తెచ్చి అందిస్తామ‌ని పేటీఎం ప్ర‌క‌టించింది.
 

జన రంజకమైన వార్తలు