లాక్‌డౌన్‌తో దుకాణాలన్నీ మూతపడ్డాయి. నిత్యావసరాల వస్తువులమ్మే షాపులకే కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక బట్టలు, బంగారం అమ్మే కొట్లు నెలరోజులుగా మూతపడ్డాయి. ఈలోగా బంగారం వ్యాపారులు భారీగా బిజినెస్ చేసుకునే అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజే (ఆదివారమే) అక్షయ తృతీయ. ఈ రోజు ఎంతో కొంత బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని చాలామంది నమ్మకం. అందుకే లాక్‌డౌన్ ఉన్నా ఆన్‌లైన్‌లో కొనుక్కోండని జోయలుక్కాస్, తనిష్క్ లాంటి బడా బంగారు ఆభరణాల షోరూమ్‌లు ప్రచారం చేస్తున్నాయి. పేమెంట్స్ యాప్ పేటీఎం కూడా ఆన్‌లైన్‌లో బంగారం అమ్ముతోంది. అదీ బోల్డన్ని ఆఫర్లతో.
పేటీఎం ఆఫర్ల వాన
పేటీఎం బంగారం కొనుగోళ్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించారు. అక్షయ తృతీయ, తర్వాత రోజు అంటే ఈ నెల 26, 27 తేదీల్లో పేటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసే వారిలో నుంచి గంటకి ఒకర్ని సెలెక్ట్ చేసి 100 శాతం గోల్డ్ బాక్ ఇస్తామని ప్రకటించింది.
కేవలం ఒక్క రూపాయితోనూ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఎంఎంటీసీ భాగస్వామ్యంతో పేటీఎం ఎంత చిన్న మొత్తంతో అయినా బంగారం కొనేందుకు ఛాన్స్ కల్పించింది.
క్యాష్‌బ్యాక్ కూడా
పేటీఎంలోని స్వీప్ స్టేక్స్ ద్వారా బంగారం కొనేవారికి క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తామని పేటీఎం ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే ఉంటుంది.