• తాజా వార్తలు

యోనోతో క‌రోనా లోన్స్ అనే ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటున్న ఎస్‌బీఐ

నాలుగైదు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ న్యూస్ విప‌రీతంగా తిరుగుతోంది. కొన్ని వెబ్‌సైట్లు కూడా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. పేరుమోసిన టీవీలు, ప‌త్రిక‌ల వెబ్‌సైట్ల‌లోనూ ఇదే గోల‌. ఇంత‌కీ ఏంటా న్యూస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) త‌న యోనో యాప్ ద్వారా ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో వినియోగ‌దారుల‌కు 45 నిముషాల్లోనే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు అత్య‌వ‌సర రుణాలిస్తుంది. దీనికి 10.5% వ‌డ్డీ ఉంటుంద‌ని, ఆరు నెల‌ల వ‌ర‌కు ఈఎంఐ కూడా క‌ట్ట‌క్క‌ర్లేద‌ని దాని సారాంశం. కానీ దీన్ని ఎస్‌బీఐ తోసిపుచ్చింది

అవ‌న్నీ ఫేక్ వార్త‌లే
తమ బ్యాంకుకు చెందిన డిజిటల్‌ సేవా విభాగం యోనోపై అత్యవసర రుణాలేవీ అందించడంలేదని ఎస్‌బీఐ ప్రకటించింది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ‘45 నిమిషాల’ వ్యవధిలోనే రూ.5 లక్షల వరకు అత్యవసర రుణాలు 10.5 శాతం వార్షిక వడ్డీ రేటుకు అందిస్తున్నాయనీ, యోనో వేదిక ద్వారా ఎస్‌బీఐ కూడా అలాంటి రుణ సదుపాయం కల్పించిందని వచ్చిన వార్తలను ఖండించింది.

అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్స్ లోన్స్ మాత్ర‌మే ఇస్తాం
క‌రోనా కారణంగా నగదు ఇబ్బంది ఎదుర్కొంటున్న ఎస్‌బీఐ కస్టమర్ల కోసం యోనో ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు ఎస్‌బీఐ చెప్పింది. ప్రీ అప్రూవ్డ్ ప‌ర్స‌న‌ల్ లోన్స్ ఇస్తామ‌ని..అవి కూడా క‌స్ట‌మ‌ర్ అర్హ‌త‌ను బట్టి నిర్ణ‌యిస్తామ‌ని.. యోనో యాప్ ద్వారా దాన్ని ప్రాసెస్ చేసే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. 

జన రంజకమైన వార్తలు