మీరు మీ డెబిట్ కార్డు ఉపయోగించి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయలేదా? అయితే మరో ఐదు రోజుల్లో అంటే మార్చి 16 తర్వాత మీ మీ డెబిట్ కార్డు డిజేబుల్ అయిపోతుంది. ఎందుకిలా? డిజేబుల్ అయిపోవడం అంటే ఏంటి? దీనికి కారణాలు ఏంటి? డెబిట్ కార్డ్ డిజేబుల్ కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా లో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను బాగా ప్రోత్సహిస్తున్నారు. పన్ను కట్టకుండా ఎగవేసే వ్యాపారులను కంట్రోల్ చేయడంలో భాగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేయడాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇలాంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోంది. అయితే ఇప్పటికీ మూడు వంతుల డెబిట్ కార్డులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు చాలా దూరంగానే ఉన్నట్లు గుర్తించారు. అలాంటి కార్డులను మార్చి 16 తర్వాత డిజేబుల్ చేయనున్నారు.
డిజేబుల్ చేయడం అంటే ఏమిటి?
డిజేబుల్ చేయడం అంటే ఆ డెబిట్ కార్డులు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను చేయకుండా నిరోధించడం. అంటే డిజేబుల్ చేసిన కార్డును ఇకపై ఎప్పుడూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను వినియోగించలేరు.
మరి ఇప్పుడేం చేయాలి?
మీ డెబిట్ కార్డు డిజేబుల్ కాకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఈ 16వ తేదీ లోపల దాంతో ఏదో ఒక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేయడం ఒకటే పరిష్కారం. అయితే ఫిజికల్ ట్రాన్సాక్షన్ అంటే కార్డును స్వైప్ చేసి ట్రాన్సాక్ట్ చేయడం కాదు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కు ఈ కార్డును ఉపయోగించాలి. దీన్ని కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ అని కూడా అంటారు.