• తాజా వార్తలు

10 ఆన్ బాక్స్ డ్ స్మార్ట్ ఫోన్లు. - మార్కెట్ రేట్ కంటే చవకగా కొనుక్కోండి ఇలా !

10 ఆన్ బాక్స్ డ్ స్మార్ట్ ఫోన్లు. -
మార్కెట్  రేట్ కంటే చవకగా కొనుక్కోండి ఇలా !

రూ. 15,000/- ల విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం పన్నెండు వేలకో లేక 11 వేల రూపాయల కో లభిస్తే ఎలా ఉంటుంది? వింటుంటే నే బాగుంది కదా! మీరు వింటున్నది నిజమే అలాంటి అనేక స్మార్ట్ ఫోన్ లు MRP కంటే చాలా తక్కువ ధరకే దేశం లోని టాప్ ఈ కామర్స్ సైట్ నందు లభిస్తున్నాయి. కాకపోతే అవి ఆన్ బాక్స్ డ్ ఫోన్ లు. అసలు వాటి కథేంటో చూద్దాం.

ప్రముఖ ఈ కామర్సు సైట్ లు అయిన అమజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటివి ప్రకటిస్తున్న ఊరించే ఆఫర్ లను చూసి వెంటనే మీ ఫోన్ మార్చి వేసి కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనాలి అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆర్టికల్ లో మేము చెప్పబోయే విషయాలను మేము చూపించబొయే స్మార్ట్ ఫోన్ లను చూసిన తర్వాత నిర్ణయించుకోండి. మేము ఇక్కడ ఇవ్వ బోతున్న లిస్టు లో ఉన్న స్మార్ట్ ఫోన్ లన్నీ బ్రాండ్ న్యూ ఫోన్ లు కాదు. అలాగని సెకండ్ హ్యాండ్ ఫోన్ లు కాదు. అవి అన్ బాక్స్ద్ స్మార్ట్ ఫోన్ లు

ఆన్ బాక్స్ డ్ స్మార్ట్ ఫోన్ లు అంటే ఏమిటి?

ఆన్ బాక్స్ డ్ అనే పదం విని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇవి అన్నింటిలానే కొత్త స్మార్ట్ ఫోన్ లే. కాకపోతే వీటి సీల్ ఓపెన్ చేసి ఉంటుంది. ఈ కామర్స్ సైట్ ల ద్వారా ఫోన్ లను కొనుగోలు చేసే వినియోగదారులు ఒక్కో సారి వాటిని వెనక్కి తిప్పి పంపించి వేస్తూ వుంటారు. వాస్తవానికి ఈ ఫోన్ లలో ఏ లోపం లేకపోయినప్పటికీ ఏవేవో కారణాలు చెప్పి వాటిని కొనుగోలు చేయకుండా వెనక్కి ఇచ్చేస్తారు. ఈ ఈ కామర్స్ సైట్ ల కుండే కొన్ని నిభందనల వలన ఈ సైట్ లు మారు మాట్లాడకుండా వాటిని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి ఫోన్ లానే ఆన్ బాక్స్ డ్  ఫోన్ లు అంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం భారత దేశం లో ప్రతీ సంవత్సరం సుమారు 20-25 మిలియన్ ల స్మార్ట్ ఫోన్ లు కస్టమర్ ల చే వెనక్కి పంపబడుతున్నాయి. మరి ఇలా వెనక్కి వచ్చేసిన ఫోన్ లను ఈ కంపెనీ లు ఏం చేసుకుంటాయి? ధర తగ్గించి 6 నెలల వారంటీ తో తక్కువ ధరకే అమ్ముతూ ఉంటాయి. ఈ ఫోన్ లానే అన్ ఆన్ బాక్స్ డ్ ఫోన్ లు లేదా రీ ఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ లు అని అంటారు. ఒక వేళ వినియోగదారుడు తిరస్కరించిన కారణం నిజమే అయితే మాన్యుఫాక్చర్ యొక్క అఫీషియల్ సర్వీస్ సెంటర్ లలో వీటిని రిపేర్ చేసి అమ్మకానికి ఉంచుతారు. అలాంటి ఫోన్ లలో కొన్నింటిని ఈ ఆర్టికల్ లో చూద్దాం.

లెనోవా వైబ్ K 5 ప్లస్

బడ్జెట్ ధర లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఈ లెనోవా వైబ్ ఒక మంచి ఎంపిక కాగలదు. దీని ధర ముందుగా రూ. 8,499/-  లు ఉంటే ఇక్కడ దీని ధర రూ 6,989/- ఉంటుంది. అంటే సుమారు రెండు వేల రూపాయలు తగ్గింపు అన్నమాట. ఇది 5 ఇంచ్ ఫుల్ HD IPS డిస్ ప్లే ను కలిగి, స్నాప్ డ్రాగన్ 616 ఆక్టా కోర్ చిప్ మరియు 16 GB స్టోరేజ్ తో లభిస్తుంది.

లీ ఎకో Le 1S

ఈ ఏడాది ప్ర్రారంభం లో LeTV ద్వారా మార్కెట్ లో సంచలనం సృష్టించిన లీ ఎకో తన Le 1S స్మార్ట్ ఫోన్ ను రూ. 10,999/- ధరలో అందించింది. ఇది కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో సంచలనాత్మకం గా అమ్ముడు పోయింది. ఫోన్ యొక్క అన్ బాక్స్ద్ ఐటం ఇప్పుడు రూ 8,799/- లకు లభిస్తుంది. ఇది జియోమీ రెడ్ మీ 3 S కంటే ఉత్తమమే కదా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

హువాయి నేక్సాస్ 6P

గూగుల్ యొక్క నేక్సాస్ బ్రాండ్ నుండి వచ్చే స్మార్ట్ ఫోన్ లన్నీ వినియోగాదరునికి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. అదే కోవలోనికి వస్తుంది హువాయి నేక్సాస్ 6P. ఇది గత కొంత కాలం నుండీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అత్యంత వేగవంతమైన ఆండ్రాయిడ్ ఫోన్ గా నిలిచింది. ఇది 5.7 ఇంచ్ ల పెద్ద డిస్ ప్లే ను, డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను, ఫాస్టర్ ఆండ్రాయిడ్ అప్ డేట్ లను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ యొక్క సరికొత్త అప్ డేట్ అయిన నౌగట్ 7.0 ఇందులో ఉంటుంది. దీని ధర రూ 26,999/- లు కాగా 8 వేల రూపాయలు తక్కువలో అంటే సుంరు 18 వేల రూపాయల లో లభిస్తుంది.

హానర్ 7

హువాయి యొక్క సబ్ బ్రాండ్  అయిన హానర్ ఎక్కువ ధర కు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశ పెట్టి వైఫల్యం చెందినప్పటికీ అన్ బాక్స్ద్ మార్కెట్ లో మాత్రం దీనికి మంచి గిరాకీ నే ఉంది. ఇక్కడ ఇది సుమారు రూ  14,999/-  లకు లభిస్తుంది. కాసేపు ధర పక్కన పెడితే దీనికి అనేక విశిష్టతలు ఉన్నాయి. 5.2 ఇంచ్ HD డిస్ ప్లే, ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 20 MP కెమెరా, హాయ్ సిలికాన్ కిరిన్ 935 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 3 GB RAM లతో ఇది అవుట్ స్టాండింగ్ గా నిలిచింది.

మోటో డ్రయిడ్ టర్బో

ఇది రూ. 20,999 /- ధర లో లభిస్తుంది. ఇది 5.2 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 808 హెక్సా కోర్ చిప్ , 21 MP రేర్ కెమెరా మరియు 3900 mAh బాటరీ లను కలిగి ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని అసలు ధర సుమారు రూ. 42,000 /- ఉంటుంది. అంటే దాదాపు సగం ధరకే మనకు లభిస్తుంది.

జియోమీ రెడ్ మీ నోట్ 3

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో నేడు మార్కెట్ లో ఉన్న టాప్ బ్రాండ్ ఏది అని అంటే అది జియోమీ రెడ్ మీ నోట్ 3 అని చెప్పవచ్చు. ఇది 2 GB RAM, 16 GB ROM ను కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది గోల్డ్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. దీని అసలు ధర రూ 8,999/- గా ఉండగా కేవలం ఒక వేయి రూపాయల తగ్గింపు తో ఇది లభిస్తుంది.

మెయిజు M2 నోట్

మీకు తక్కువ బడ్జెట్ లో ఆపిల్ యొక్క ఐ ఫోన్ ను పోలి ఉన్న ఫోన్ కావాలంటే మీరు ఒకసారి ఈ మెయిజు M2 నోట్ ను చూడవలసిందే. ఇది కేవలం ఐ ఫోన్ డిజైన్ మాత్రమే కాక ఫీచర్ ల లోనీ ఐ ఫోన్ ను పోలి ఉంటుంది. ఇది 5.2 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే, 1.3 GHz ఆక్టా కోర్ మీడియా టెక్ 6735 SoC, 2 GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్, 13 MP కెమెరా, 5 MP సెల్ఫీ స్నాపర్ లను కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ 9,999/- గా ఉండగా ఇక్కడ రూ 7,799/- లకు లభిస్తుంది.

వన్ ప్లస్ 2

ఇది SD 820 చిప్, 6 GB RAM, 64 GB ROM స్నాప్ డ్రాగన్ 810 చిప్ 5.5 HD డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ను కలిగి ఉంటుంది. దీని ధర రూ 27,999 లు గా ఉంటుంది. అయితే ఇది  రూ 15,777 లకు లభిస్తుంది.

సామ్ సంగ్ గాలక్సీ S6

సామ్ సంగ్ గాలాక్సి యొక్క అన్ బాక్స్ద్ వెర్షన్ రూ 29,999 /- లకు లభిస్తుంది. అయితే దీని అసలు ధర రూ 36,000/- లకు పైనే ఉంటుంది. ఇది 64 GB బ్లాకు వేరియంట్ లో లభిస్తుంది.

సామ్ సంగ్ గాలక్సీ నోట్ 5 +

సామ్ సంగ్ గాలక్సీ 5.7 ఇంచ్ QHD సూపర్ AMOLED display, 8890 ఆక్టా కోర్ చిప్, 4 GB RAM 16 MP కెమెరా లలో లభిస్తుంది. దీని అన్ బాక్స్ద్ ధర రూ 32,990 / - లు ఉంటుంది.

ఈ ఫోన్ లు అన్ని ప్రముఖ ఈ - కామర్స్ సైట్లలో అందుబాటులో వున్నాయి... 

జన రంజకమైన వార్తలు