int(5597) టీవీ ఓపెన్‌సెల్‌పై 5% దిగుమ‌తి సుంకం.. పెర‌గ‌నున్న టీవీల ధ‌ర‌లు - Computervignanam - Telugu Technology News

టీవీ ఓపెన్‌సెల్‌పై 5% దిగుమ‌తి సుంకం.. పెర‌గ‌నున్న టీవీల ధ‌ర‌లు

టీవీల్లో ఉప‌యోగించే ఓపెన్‌ సెల్ అనే స్పేర్ పార్ట్‌పై 5 శాతం దిగుమతి సుంకం అక్టోబరు ఒకటి నుంచి తిరిగి విధించే అవ‌కాశాలున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు ఇటీవ‌ల ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించాయి. ఇదే జ‌రిగితే టీవీల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. 

మిన‌హాయింపు ముగిసింది
ఓపెన్‌సెల్‌పై దిగుమతి సుంకం మినహాయింపు కావాల‌ని టీవీ త‌యారు చేసే కంపెనీలు గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వానికి రిక్వెస్ట్ చేశాయి. ఇప్ప‌టికిప్పుడు తాము త‌యారుచేసుకోలేమ‌ని అందుకే మిన‌హాయింపు ఇవ్వాల‌ని అడిగాయి. కేంద్రం ఇచ్చింది. ఆ టైమ్ ఈ నెల  30తో ముగిసిపోతుంది.

ఇక్క‌డే త‌యారుచేసుకోవాల‌ని
టీవీ అసెంబ్లింగ్ కాకుండా మొత్తం ఇక్క‌డే మాన్యుఫాక్చ‌రింగ్ చేయాల‌న్న‌ది కేంద్రం ఆలోచ‌న‌. అందుకే కంపెనీల‌పై మ‌ళ్లీ దిగుమ‌తి సుంకం విధిస్తామంటోంది. అలా అయితే కంపెనీలు త‌యారుచేస్తాయ‌ని ప్లాన్‌. ఒక‌వేళ చేసుకోలేక‌పోతే దిగుమతి సుంకం క‌ట్టాలి. 

ఎంత పెర‌గొచ్చు?
ఓపెన్ సెల్‌పై 5% దిగుమతి సుంకం విధిస్తే టీవీల ధ‌ర‌లు వాటి సైజును బ‌ట్టి 600 నుంచి 1500 వ‌ర‌కు అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు లెక్క‌లేస్తున్నాయి. 

 

టీవీ ఓపెన్‌సెల్‌పై 5% దిగుమ‌తి సుంకం  పెర‌గ‌నున్న టీవీల ధ‌ర‌లు Customs duty on Tv open cells Tv costs raise