• తాజా వార్తలు

ఈ విధంగా చేస్తే తాత్కాల్ టిక్కెట్లు సూపర్ ఈజీ గురూ!

తాత్కాల్ టిక్కెట్లు అనుకుంటాం కానీ వాటిని సంపాదించ‌డం చాలా సుల‌భం. తాత్కాల్ టిక్కెట్ దొరికిందంటే పెద్ద పండ‌గ కిందే లెక్క‌. ఎందుకంటే దీనిలో ఉండే రూల్స్‌, ర‌ష్ వ‌ల్ల ఇవి ధ‌ర ఎక్కువ పెట్టినా దొర‌క‌ని ప‌రిస్థితి. మ‌రి త‌త్కాల్ టిక్కెట్లు చాలా సుల‌భంగా దొరికితే! రైల్వే అథారిటీస్ ఇందుకోసం కొన్ని మార్పులు చేసాయి.. మ‌రి అవేంటో తెలుసుకుందామా!

బ్లాక్‌ను ఆపేసి
ఇటీవ‌లే రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ వాళ్లు అనైతికంగా సాఫ్ట్‌వేర్ సిస్ట‌మ్స్‌ను యూజ్ చేస్తూ తాత్కాల్ టిక్కెట్ల‌ను బ్లాక్ చేస్తున్న ఏజెంట్ల‌ను అరెస్ట్ చేశారు. అనైతికంగా తాత్క‌ల్ టిక్కెట్ల‌ను బ్లాక్ చేస్తున్న జాగ‌ర్‌, మాక్‌, ఏఎన్ఎంఎస్ లాంటి సాఫ్ట్‌వేర్ల‌ను ఆపేసిన‌ట్లు ఆర్‌ఫీఎఫ్ తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్ల ద్వారా ఐఆర్‌సీటీసీ సైట్ల‌లోకి అక్ర‌మంగా చొర‌బ‌డి టిక్కెట్ల‌ను చోరీ చేస్తున్న‌ట్లు పోలీసులు క‌నుగొన్నారు.  సాధారంగా తాత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేవాళ్లు ఈ ప్రాసెస్‌లు అంతా పూర్తి చేసుకుని ముందుకెళ్లే స‌రికే టిక్కెట్లు బ్లాక్ అయిపోతున్నాయి. దీనికి సాధార‌ణ జ‌నానికి 2.55 నిమిషాలు అవుతుండ‌గా, బ్లాక్ టిక్కెట్లు బుక్ చేసేవాళ్లు 1.48 నిమిషాల్లోనే ప‌ని పూర్తి చేస్తున్నారు. 

ప్ర‌యాణీకులకు లబ్ధి ఎలా?
బ్లాక్ చేసేవాళ్ల‌ను ఆపారు స‌రే.. మ‌రి ప్ర‌యాణీకుల‌కు దీని వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? ఉదాహ‌ర‌ణ‌కు మ‌గ‌ద్ ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్ర‌వ‌రి 25, 2020న 10.02.18 గంట‌ల‌కు క్లోజ్ అయితే తాత్కాల్ బుకింగ్ ఫిబ్ర‌వ‌రి 26, 10.01.38 గంట‌కు ఓపెన్ అవుతున్నాయి. అంటే తాత్కాల్ టిక్కెట్ ల‌భ్య‌మ‌య్యే టైమ్ డ్యూరేష‌న్ బాగా త‌గ్గింది. దీని వ‌ల్ల త్వ‌ర‌గా బుక్ చేసుకునే అవ‌కాశం ప్ర‌యాణీకుల‌కు ద‌క్కుతుంది. 

జన రంజకమైన వార్తలు