అమెజాన్ ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఫ్యాషన్ అన్నింటిమీద ఆఫర్లు ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లపైనా తగ్గింపు ధరలు ఇచ్చింది. అవేంటో చూడండి.
ఐఫోన్ 11
ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ధరలు ప్రకటిచింది. మొదట 64,800 ధర ఉన్న ఐఫోన్ 11.. 64జీబీ స్టోరేజ్ ఫోన్ ధరను ఇటీవలే 54,900కు తగ్గించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో దీన్ని 47,999కే అందిస్తోంది.
శాంసంగ్
24,999 రూపాయల ధర ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎం31ను 2,500 రూపాయల తగ్గింపుతో 22,499కి అందిస్తోంది. గెలాక్సీ ఎం31ఎస్‌పై వెయ్యి తగ్గించింది. 18,499కి కొనుక్కోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ధర కంపెనీ వెబ్‌సైట్‌లో 57,800 కాగా అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో 39,999 రూపాయలకే దొరుకుతోంది.
హానర్
హానర్ 9 ధర 11,999 నుంచి 2వేలు తగ్గి 9,999కి అమెజాన్ సేల్‌లో లభిస్తోంది.
హానర్ 9ఎక్స్ ధర వెయ్యి తగ్గి 15,999కి వస్తుంది.
వన్‌ప్లస్
వన్‌ప్లస్ లేటెస్ట్ మోడల్ వన్‌ప్లస్ 8.. 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ | ధర 41,999 రూపాయలు. గ్రేట్ ఇండియన్ సేల్‌లో 2వేలు త్గగించి 39,999కి ఇస్తుంది.
వన్‌ప్లస్ 8.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 49,999 రూపాయలు. 5వేలు తగ్గంచింది. 44,999కి అమెజాన్ సేల్లో దొరుకుతుంది.
షియోమి
షియోమి రెడ్‌మీ నోట్ 9 ప్రో అసలు ధర 13,999. వెయ్యి తగ్గించింది.
రెడ్‌మీ నోట్ 9 ధర 11,999నుంచి 10,999కి తగ్గింది.
రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ధర 16,999 నుంచి 15,999కి తగ్గింది.
ఎంఏ 10 5జీ ఫోన్ ధర 44,999పై 5వేల డిస్కౌంట్ అమెజాన్ సేల్లో దొరుకుతుంది.
రెడ్‌మీ నోట్ 8 ధర 12,499 నుంచి వెయ్యి తగ్గి 11,499కి లభిస్తుంది. |
వివొ
వివో వీ 17 ధర ఫ్లిప్‌కార్ట్‌లో 20,990. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో 17,990కే లబిస్తుంది.
వివో వై30 ధర వెయ్యి తగ్గి 13,990కి దొరుకుతుంది.
ఒప్పో
ఒప్పో ఏ52 16,990 ధరతో లాంచ్ అయింది. 3వేల డిస్కౌంట్‌తో 13,990కి లభిస్తుంది.