• తాజా వార్తలు

ఈ గేమ్‌ని 3 రోజుల్లో కోటీమంది డౌన్లోడ్ చేసుకున్నారు, అసలేంటిది ?

 

గేమింగ్ ప్రియులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో కంపెనీలు ఎక్కువగా గేమింగ్ పైనే దృష్టి పెడుతున్నాయి. అదను చూసి గేమ్ లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఆ మధ్య  ఫోర్ట్ నైట్ సంచలనం రేకిత్తించిన  సంగతి  మరువక ముందు ఇప్పుడు పబ్ జి గేమ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అయితే ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో కొత్త గేమ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పేరే అపెక్స్ లెజెండ్స్. అమెరికాకు చెందిన వీడియో గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియో రెస్పాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ గేమ్‌ను రూపొందించింది. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (ఈఏ) అనుబంధ సంస్థ. సాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ గేమ్ మార్కెట్‌లోకి వచ్చిన మూడు రోజుల్లోనే కోటి మంది ప్లేయర్లను ఆకట్టుకుంది. 

కేవలం మూడు రోజుల్లోనే అపెక్స్ లెజెండ్స్‌ ప్లేయర్ల సంఖ్య కోటి దాటింది. దాదాపు 10 లక్షల మంది ఒకేసారి గేమ్‌లోకి లాగిన్ అవుతున్నారని ఈఏ తెలిపింది. గత రెండు రోజుల్లో లైవ్ స్ట్రీమింగ్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్విచ్‌లో ఎక్కువ మంది వీక్షించిన గేమ్ ఇదేనని తెలుస్తోంది. అయితే అపెక్స్ గేమ్‌ను కేవలం ఎక్స్‌బాక్స్, పీఎస్4, పీసీల్లోనే ఆడుకోవాల్సి ఉంటుంది. దీన్ని మొబైల్ వెర్షన్‌ ఇంకా మార్కెట్ లోకి ప్రవేశపెట్టలేదు. విజయవంతం అయింది కాబట్టి త్వరలో మార్కెట్‌లోకి రావొచ్చు. 

కంపెనీ షేర్లు పతనమైన కొన్ని రోజులకే అపెక్స్ లెజెండ్స్ గే మ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీంతో కంపెనీ షేర్లు ఆకాశానికి ఎగబాకాయి. ఫిఫా, నీడ్ ఫర్ స్పీడ్, బ్యాటిల్ ఫీల్డ్ వంటి ఐకానిక్ గేమ్ ఫ్రాంచైజీలు కూడా ఈఏ సొంతమై ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫోర్ట్‌నైట్, పబ్‌జి వంటి ఉచితంగా ఆడే ఆన్‌లైన్ గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఈఏపై ప్రతికూల ప్రభావం పడింది అయితే కొత్తగా వచ్చిన గేమ్ వీటిని మరిపిస్తోంది. కాగా ఫోర్ట్‌నైట్, పబ్‌జి గేమ్స్ రెండింటిలోనూ చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్‌సెంట్‌కు వాటా ఉంది.

ఫస్ట్ టైం ఈ గేమ్ లోకి ఎంటర్ అయ్యేవారు  Apex Legends guides లో పూర్తి సమాచారం తెలుసుకుని ఎంటర్ కావాలని కంపెనీ తెలిపింది.ఇది ప్రీమియం సబ్ స్క్రిప్సన్ తో గేమింగ్ ప్రియులు ఆడుకోవాల్సి ఉంటుంది. కాయిన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బోనస్ ఆపర్ కూడా అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ పిరియడ్ మాత్రమేనని కంపెనీ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు