టెక్నాలజీ దిగ్గజం యాపిల్ యాపిల్ దీపావళికి ఇండియాలో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆన్‌లైన్ స్టోర్ యాపిల్.ఇన్‌లో కొంటే ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.
ధర తగ్గించి.. ఎయిర్‌పాడ్స్ ఫ్రీగా ఇస్తోంది
ఐఫోన్ 11.. 64 జీబీ ధర 68,300. యాపిల్.ఇన్‌లో కొనేవారి కోసం దాన్ని ఇటీవల దాన్ని 53,400కి తగ్గించింది. ఇప్పుడు దానికి అదనంగా రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. కంపెనీ నుంచి నేరుగా కొనుగోళ్లు జరిపేవారిని ఎంకరేజ్ చేయడానికి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. యాపిల్.ఇన్ వెబ్‌సైట్‌లో కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో మరో ఆఫర్.
ఇదిలా ఉంటే పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో ఐఫోన్ 11ను రూ.49,999కే అందించనుంది.
ఏది బెటర్?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ 11 ధర రూ.49,999 అంటే 50వేలు. అదే మరో 3,400 ఎక్కువ వేసుకుని యాపిల్.ఇన్‌లో కొనుక్కుంటే 15వేల రూపాయల విలువైన ఎయిర్‌పాడ్స్ ఫ్రీగా పొందవచ్చు. కాబట్టి ఈ ఆఫర్ బెటర్ ఆప్షన్