• తాజా వార్తలు

యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌.. క్యాష్‌బ్యాక్స్‌, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు.. ఇంకా చాలా

ఐఫోన్ తయారీదారు యాపిల్ ఇండియాలో తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను రీసెంట్‌గా ప్రారంభించింది. ప్రారంభ ఆఫ‌ర్లుగా త‌మ ఉత్ప‌త్తుల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది.

క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెల‌క్టెడ్ మోడ‌ల్ ఐఫోన్ల‌పై 6% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ గరిష్టంగా10,000 రూపాయలు. వారం రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. క్యాష్‌బ్యాక్ పొందాలంటే మినిమం కొనుగోలు విలువ 20,900 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. ఈ ఆఫ‌ర్ ఒక ఆర్డర్‌కు పరిమితం. అక్టోబర్16 వరకు ఆఫ‌ర్అందుబాటులో ఉంటుంది.

నోకాస్ట్ ఈఎంఐ కూడా

దీంతోపాటు మ‌రికొన్ని క్రెడిట్ కార్డుల‌పై నోకాస్ట్ ఈఎంఐను కూడా ఆఫ‌ర్ చేస్తుంది. ఎక్స్‌ప్రెస్, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీబ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జె అండ్ కె బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బిఎల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా నోకాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్ ల‌భిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఆరు నెలల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఇస్తోంది.

పాత ఫోన్ల‌కు ఎక్స్చేంజ్‌

పాత ఐఫోన్ అమ్మకం ద్వారా కొత్త ఐఫోన్ కొనుక్కోవ‌చ్చు. బ్రాండ్, మోడల్, కండిషన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆన్‌లైన్‌లో అడుగుతారు. వాటికి జవాబులు చెప్పాలి. తరువాత ట్రేడ్-ఇన్ క్రెడిట్ ఇస్తుంది. ఆ మొత్తాన్ని కొత్త ఐఫోన్ ధ‌ర‌లో నుంచి త‌గ్గించి మిగ‌తా అమౌంట్ క‌ట్టాల్సి ఉంటుంది. యాపిల్ పాత ఫోన్లే కాకుండా శాంసంగ్, గెలాక్సీ ఎస్10, వన్‌ప్లస్ 6టీ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా ఈ క్రెడిట్ ఆఫర్ చేస్తోంది.

ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో పూర్తి వివ‌రాలు

ఈ క్యాష్ బ్యాక్‌, ఎక్స్చేంజ్‌, ట్రేడ్ ఇన్ క్రెడిట్ ఎంత వస్తుంద‌నే పూర్తి వివ‌రాల‌కు యాపిల్ ఇండియా స్టోర్ www.apple.com/inలో చూడొచ్చు.

జన రంజకమైన వార్తలు