• తాజా వార్తలు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

టెక్నాల‌జీ ల‌వ‌ర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ ప‌ర‌వ‌శం. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ ఇండియాలో మ‌నం యాపిల్ ప్రొడ‌క్ట్ ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలంటే మాత్రం థ‌ర్డ్ పార్టీ ఈకామర్స్ యాప్‌లే దిక్కు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి ఈకామ‌ర్స్ సైట్ల‌లోనే ఇప్ప‌టివ‌ర‌కూ మ‌నం యాపిల్ ప్రొడ‌క్ట్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుక్కోగ‌లుగుతున్నాం. ఇండియ‌న్ మార్కెట్ స్థాయి పెరుగుతుంద‌న్న అంచ‌నాలుండ‌టంతో యాపిల్ ఇండియాలో కూడా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించ‌బోతోంది.
 

సెప్టెంబ‌ర్ 23నుంచే
* సెప్టెంబ‌ర్ 23 (బుధ‌వారం) నుంచే యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభ‌మ‌వుతుంది. 
* apple.com/in పేరుతో ఇండియాలో ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభం కానుంది.

ఏమిటి ఉప‌యోగం? 
* నేరుగా బ్రౌజ‌ర్‌లో apple.com/in లోకి వెళ్లి మీకు కావాల్సిన ప్రొడ‌క్ట్స్ కొనుక్కోవ‌చ్చు.
* ఐఫోన్ నుంచి ఐప్యాడ్ వ‌ర‌కు, మ్యాక్‌బుక్ నుంచి ఐ మ్యాక్ వ‌ర‌కు యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నీ ఈ ఆన్‌లైన్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
* ఈ వెబ్‌సైట్‌లో యాపిల్ ప్రొడ‌క్ట్స్ మీద డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు కూడా స‌మ‌యానుకూలంగా ఇస్తారు. వాటిని కూడా పొంద‌వ‌చ్చు. 
* కంపెనీ అఫీషియ‌ల్ వెబ్‌సైట్ కాబ‌ట్టి సేల్స్‌, స‌ర్వీస్ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
* ప్రొడ‌క్ట్స్ కొనుగోలులో కంపెనీ వెబ్‌సైట్ మీకు స‌హాయ‌ప‌డుతుంది. 

జన రంజకమైన వార్తలు