• తాజా వార్తలు

గ్రామీణ భారత చెల్లింపుల విధాణాన్ని సమ్మూలంగా మార్చేయనున్న భారత్ బిల్ పేమెంట్ సిస్టం

గ్రామీణ భారత చెల్లింపుల విధాణాన్ని సమ్మూలంగా మార్చేయనున్న "భారత్ బిల్ పేమెంట్ సిస్టం"

భారత్ బిల్ పే మెంట్ సిస్టం (BBPS ) తో ఇక సులభంగా బిల్లులు చెల్లించండి.

రమేష్ ఒక వలస కూలీ. పొట్టకూటి కోసం ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉంటున్నాడు. అక్కడ భవన నిర్మాణ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తెలంగాణా లోని ఒక మారుమూల పల్లెటూరి లో అతని తలిదండ్రులు ఉంటున్నారు. ఇతను డబ్బులు పంపితేనే వారికి పూట గడుస్తుంది. తిండికి లోటు లేకుండా వారికి డబ్బు పంపిస్తాడు కానీ కరెంటు బిల్, గ్యాస్ బిల్, ఫోన్ బిల్ లాంటి కొన్ని బిల్లులు చెల్లించడం వారికి తెలియదు. ఎవరినైనా అడిగితే విసుక్కుంటారు. కాబట్టి ప్రతీసారీ రమేష్ వచ్చి అన్ని బిల్లులూ చెల్లించి వెళుతూ ఉంటాడు. ఇలా రాకుండా తెలంగాణా బిల్లులు కూడా మధ్యప్రదేశ్ లోనే చెల్లిస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాడు. అలాంటి తరుణం లో అతనికి ఒక అద్భుతమైన వార్త కనిపించింది. అదే BBPS. వెంటనే దాని గురించి ఎంక్వైరీ చేశాడు. వివరాలు తెల్సుకున్నాడు. ఇక BBPS ద్వారా తెలంగాణా బిల్లులు మధ్యప్రదేశ్ లో చెల్లించడానికి సమాయత్తం అవుతున్నాడు. ఇంతకూ BBPS అంటే ఏమిటి? దాని ద్వారా బిల్లులు ఎలా చెల్లిస్తారు?

BBPS అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టం. ఇది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా యొక్క మానస పుత్రిక. మన నిత్యావసర సేవలకు సంబందించిన బిల్లులను ఎక్కడినుండైనా చెల్లించేందుకు వీలుగా రిజర్వు బ్యాంకు మదిలో ఉన్న ఆలోచనే ఈ BBPS. ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్,గ్యాస్ బిల్, టెలిఫోన్ బిల్, DTH, ఇన్సూరెన్స్ తదితర సేవలకు సంబందించిన బిల్లులన్నింటినీ భారతదేశం లో ఎక్కడినుండైనా దీనిద్వారా చెల్లించవచ్చు.

ఏదైనా బ్యాంకు కానీ పే మెంట్ కంపెనీ కానీ తన వినియోగదారులను ఈ BBPS ద్వారా బిల్లులు చెల్లించమని కోరాలి. ఈ వ్యవస్థ భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ (BBPCU ) అని పిలువబడే ఒక డిజిటల్ ప్లాట్ ఫాం ను కలిగి ఉంటుంది. ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యం లో నడుపబడుతుంది. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ BBPOU అనే ఒక నెట్ వర్క్ ను కలిగి ఉంటుంది. అందరు బిల్లర్ లనూ ఈ BBPCU ఒక సెంట్రల్ సర్వర్ తో కలిపి ఉంచుతుంది. BBPOU లు అని పిలువబడే ఆపరేటింగ్ యూనిట్ లు రెండు సెట్ ల ప్లేయర్ లతో కూడి ఉంటాయి. ఒకవైపు బ్యాంకులు మరియు పే టిఎం, ఆక్సిజన్ , మొబిక్ విక్, ఇట్జ్ కాష్ లాంటి వాలెట్ లూ మరొక వైపు బిల్ డెస్క్ , టెక్ ప్రాసెస్, సిట్రస్ పే  మరియు యూరో నెట్ లాంటి అగ్గ్రిగేటర్స్ మరొక వైపు ఈ BBPOU లలో ఉంటాయి.

ఈ BBPS ద్వారా పేమెంట్ లు చేసేటపుడు కస్టమర్ లు ఆన్ లైన్ ద్వారా కానీ లేదా BBPOU ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. ఇది మరికొన్ని వారాల్లో అందుబాటులోనికి రానుంది. ఒక్కసారి ఈ BBPOU కస్టమర్ ఐడి లభించిన తర్వాత వారు ఎక్కడ నుండి అయినా ఏ విధంగా అయినా బిల్లు లు చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ మరియు డెబిట్ కార్డు లు, ఈ వాలెట్ లు లాంటివి మాత్రమే కాక ఆఫ్ లైన్ మోడ్ లో కూడా బిల్లులు చెల్లించవచ్చు. కొన్ని కొన్ని బ్యాంకులు ATM ద్వారా కూడా ఇంటర్ ఫేస్ ను కల్పించవచ్చు.

పేమెంట్ విధానాలను ఈ BBPS ఎలా మార్చబోతోంది? మొదటి రోజు నుండే వేళా సంఖ్యలో కలెక్షన్ సెంటర్ లను ఏర్పాటు చేయడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్ లకు సరికొత్త వేదికలను ఇది కల్పించబోతోంది. ఈ పేమెంట్ సౌకర్యాన్ని విద్యా సంస్థలకు కూడా విస్తరించే ప్రణాళికలలో దీని రూప కర్తలు ఉన్నారు. ఒక్కసారి ఈ BBPS అమలు లోనికి వచ్చిన తర్వాత బిల్లు లు కట్టడం లో ఉండే ఛార్జ్ లు గణనీయంగా తగ్గనున్నాయి. కంపెనీ లే వందల సంఖ్య లో తమ కలెక్షన్ సెంటర్ లను ఓపెన్ చేయనున్నాయి. వీటిని BBPOU లు గా కూడా మార్చనున్నాయి. తద్వారా వారి కంపెనీ కి సంబందించిన బిల్లులే కాకుండా మిగతా సర్వీస్ ప్రొవైడర్ ల యొక్క బిల్లు లను కూడా కట్టించుకోనున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం . BBPS యొక్క లాంచింగ్ ప్రకటన కోసం ఎదురుచూద్దాం. BBPS ద్వారా మన బిల్లింగ్ లను సులభతరం చేసుకుందాం.

 

జన రంజకమైన వార్తలు