ఇంటర్నెట్ బ్యాంకింగ్.. నగదు పంపడానికి మంచి సాధనం. బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు నెట్ బ్యాంకింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని మీ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ నుంచే కావలసిన వారికి నేరుగా డబ్బులు పంపుకోవచ్చు. డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత అందరికీ అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు తీర్చడానికి నెట్ బ్యాంకింగ్ ఇప్పుడు అందరికీ పనికొచ్చే ఏర్పాటుగా చెప్పుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లి లైన్లలో నిలబడి సమయం, శ్రమ వృథా చేసుకునే పని లేకుండా ఉన్నచోట నుంచి ఎక్కడికైనా క్షణాల్లో నగదు పంపించుకునే అవకాశాన్ని నెట్ బ్యాంకింగ్ మీకు కల్పిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంకు సురక్షితమైన, సులువైన, వేగవంతమైన నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ సౌలభ్యాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.
నెట్ బ్యాంకింగ్ చేయడానికి ఏం కావాలి?
* కోటక్ మహీంద్రా బ్యాంకు సీఆర్ ఎన్ (కస్టమర్ రిలేషన్ నెంబర్)
* మీ అకౌంట్ పాస్‌వర్డ్
* మీ ఖాతాతో లింకై ఉన్న సెల్ నెంబర్
* మీరు డబ్బులు పంపాల్సిన వ్యక్తి లేదా సంస్థ పేరు, అకౌంట్ నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి, ఐఎఫ్ ఎస్సీ కోడ్
* ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్
* మీ అకౌంట్‌లో తగినంత నగదు
బెనిఫిషరీని యాడ్ చేసుకోవడం ఎలా?
గూగుల్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాగిన్ పేజీకి వెళ్లాలి. సీఆర్ఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అక్కడ నుంచి నేరుగా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌కు వెళ్లాలి.
ఇప్పుడు మీకు సెల్‌ఫోన్ లేదా ఈ మెయిల్ ఐడీకి డైనమిక్ యాక్సెస్ కోడ్ వస్తుంది. దీన్ని వెబ్‌సైట్‌లో డైనమిక్ యాక్సెస్ కోడ్ అని ఉన్నచోట ఎంటర్ చేయాలి. మీకు కోడ్ రాకపోతే 30 సెకన్లు వేచి ఉండండి. ఆ తర్వాత అక్కడున్న లింక్‌ను క్లిక్ చేయండి. అప్పుడు బ్యాంకు నుంచి మీ సెల్‌ఫోన్‌కు కాల్ చేసి ఈ నెంబర్ చెబుతారు.
డైనమిక్ యాక్సిస్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక మీరు హోం పేజీలోకి వెళతారు. దీనిలో రెండో ఆప్షన్‌గా ఉన్న బ్యాంకింగ్‌ను ఎంచుకోవాలి.
బ్యాంకింగ్‌ను క్లిక్ చేస్తే దానికింద చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. దీనిలో నుంచి ట్రాన్స్‌ఫర్స్ అండ్ పేమెంట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దానిలో యాడ్/ మేనేజ్ బెనిఫిషరీ అనే దానిపై క్లిక్ చేయాలి.
ఇప్పడు మీకు కుడిచేతివైపున కనిపించే యాడ్ ఏ బెనిఫిషరీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి.
యాడ్ ఏ బెనిఫిషరీ అనే పేజీలో మీరు డబ్బులు పంపాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ పేరు, చిరునామా, బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలన్నీ ఎంటర్ చేసి కింద ఉన్న యాడ్ ది బెనిఫిషరీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. వివరాలన్నీ సరి చూసుకుని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే యాడ్ ఏ ట్రాన్స్‌ఫర్ టైప్‌ను క్లిక్ చేయాలి.
ట్రాన్స్‌ఫర్ టైప్‌ను ఎంచుకోవాలి. అంటే డబ్బులు పంపాల్సిన అకౌంట్ కోటక్ బ్యాంక్‌ది అయితే ఫస్ట్ ఆప్షన్, ఇతర బ్యాంకు అకౌంట్ అయితే రెండోది, ఐఎంపీఎస్ అయితే చివరి ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీని కిందే నెఫ్ట్/ ఆర్టీజీఎస్ ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే నెఫ్ట్ ద్వారా ఆదివారం, సెలవుదినాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయలేం. ఒకవేళ చేసినా అది తర్వాత వర్కింగ్ డే నాడే మీరు పంపాల్సిన అకౌంట్‌లో జమవుతుంది.
ఇవన్నీ పూర్తయ్యాక అదే పేజీలో మీరు మనీ పంపాల్సిన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేయాలి.
మీరు మనీ పంపాల్సిన అకౌంట్ సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, క్రెడిట్ కార్డా వంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. దానిలో మీకు సరిపడినదాన్ని సెలెక్ట్ చేయాలి.
ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేయాలి. తెలియకపోతే బ్యాంకు బ్రాంచి లేదా బ్యాంకు పేరు వంటి వాటితో వెతికేందుకు ఏర్పాటు ఉంది.
ఇవన్నీ నమోదు చేసి సబ్మిట్ చేశాక మీరు మళ్లీ యాడ్/ మేనేజ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ కు వెళ్లాలి. అక్కడ మీరు యాడ్ చేసిన బెనిఫిషరీ పేరు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు యాక్టివేషన్ కీ వస్తుంది.
యాక్టివేషన్ కీ ని ఎంటర్ చేసి కన్‌ఫర్మ్ చేస్తే మీ కొత్త బెనిఫిఫరీ యాక్టివ్ అయినట్లే. కొత్త బెనిఫిఫరీ యాడ్ అయినట్లు మీ సెల్ నెంబర్‌కు మెసేజ్ కూడా వస్తుంది.
కొన్ని బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసుకుంటే యాక్టివేట్ చేయడానికి కొన్ని గంటల నుంచి రోజు వరకు సమయం పడుతుంది. కానీ కోటక్ మహీంద్రా బ్యాంకులో ఇది సెకన్లలో పూర్తవుతుంది. అయితే నెఫ్ట్ పద్ధతిలో మనీ పంపాలంటే మాత్రం యాక్టివేషన్ పూర్తయిన 24 గంటల వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత నెఫ్ట్ / ఆర్టీజీఎస్‌ల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని మీరు పంపాల్సిన అమౌంట్ పంపొచ్చు. తక్షణమే పంపాలా.. తర్వాత పంపాలా అనేది కూడా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ట్రాన్సాక్షన్ కొడితే మీ ట్రాన్సాక్షన్ పూర్తయిపోతుంది.
* ఐఎంపీఎస్‌లో అయితే ఆదివారం, సెలవుదినాలతో సహా ఏ రోజైనా, ఏ క్షణమైనా డబ్బులు పంపొచ్చు. మరుక్షణమే బెనిఫిషరీ అకౌంట్‌లో జమయిపోతుంది. కోటక్ మహీంద్రా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఐఎంపీఎస్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే యాడ్/ మేనేజ్ బెనిఫిషరీలోకి వెళ్లి యాడ్ ఏ ట్రాన్స్‌ఫర్ టైప్‌లో ఐఎంపీఎస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలినదంతా పైన చెప్పిన మాదిరిగానే చేసి బెనిఫిషరీని యాడ్ చేసుకోవచ్చు.