• తాజా వార్తలు

క‌రోనా ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న ఇండియా.. డిజిట‌ల్ చెల్లింపులకు గ‌త‌కాల‌పు వైభ‌వం

క‌రోనా ఎఫెక్ట్ నుంచి కోలుకుని దేశం కాస్త ముంద‌డుగు వేస్తోంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దానికితోడు పండ‌గ‌ల సీజ‌న్ కావ‌డంతో క్యాష్ ట్రాన్సాక్ష‌న్స్‌తోపాటు డిజిట‌ల్ పేమెంట్స్ కూడా పెరిగాయి. ఇండియాలో డిజిటల్‌ చెల్లింపులు కరోనాకు పూర్వం అంటే  జనవరి-ఫిబ్రవరిలో ఏ స్థాయిలో ఉండేవో ఆ స్థాయికి పెరిగాయ‌ని  మార్కెట్ విశ్లేషిస్తోంది. 
ఎన్‌పీసీఐ లెక్క‌లేమిటంటే..
నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో డిజిట‌ల్ పేమెంట్స్ ఇలా ఉన్నాయి.    
* యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్  (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌ ద్వారా 180 కోట్ల ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగాయి. వీటి విలువ రూ.3.29 లక్షల కోట్లు.  ఆగస్టులో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 161 కోట్ల లావాదేవీలే జ‌రిగాయి. 
* ఐఎంపీఎస్ అదే ఇమ్మీడియెట్‌ పేమెంట్‌ సర్వీసె్స్ అయితే ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం 2 కోట్ల 79 ల‌క్ష‌ల ట్రాన్సాక్ష‌న్స్ సెప్టెంబ‌ర్‌లోనే జ‌రిగాయి. వీటివిలువ 2.48 లక్షల కోట్ల ర‌కూపాయ‌లు.   
* ఇక గతనెల భారత్‌ బిల్‌ పే ద్వారా రూ.3,920.83 కోట్ల విలువైన 2.31 లక్షల లావాదేవీలు జ‌రిగాయి. 

ఈకామ‌ర్స్‌కు ఊపుతో డెబిట్‌, క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్ష‌న్స్ కూడా
ద‌స‌రా, దీపావ‌ళి వంటి పండ‌గ‌ల సీజ‌న్ రావ‌డం, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియ‌న్ సేల్స్‌, అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్స్‌, మింత్రా, పేటీఎం, టాటా క్లిక్ వంటి ఈకామ‌ర్స్ సైట్ల‌లో కొనుగోళ్లు ల‌క్ష‌ల్లో జ‌రిగాయి. అంతేకాక బ‌ట్ట‌లు, వాహనాల అమ్మ‌కాలు కూడా ఊపందుకుకున్నాయి. వీట‌న్నింటికీ సంబంధించి డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్స్ ట్రాన్సాక్ష‌న్స్  సెప్టెంబరు నెల చివరిక‌ల్లా  ప్రీ-కొవిడ్‌ స్థాయికి చేరుకుని ఉంటాయని బ్యాంకింగ్ వర్గాల అంచ‌నా. అక్టోబ‌ర్‌లోవి కూడా క‌లిపితే ఈ అంకె ఇంకా పెద్ద‌గానే ఉండొచ్చు.

జన రంజకమైన వార్తలు