ఫాస్టాగ్.. ఇప్పుడు బాగా నలుగుతున్న పదమిది.. టోల్‌గేట్ దగ్గర మన పని వేగవంతం కావడం కోసం ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని అమలు చేసింది. ఫాస్టాగ్‌ను పేమెంట్ మెథడ్‌కు కనెక్ట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతుంది. మన ప్రయాణానికి ఆటంకం ఉండదు. అయితే మీరు ఏ పేమెంట్ మెథడ్‌ని ఎంచుకున్నా కూడా ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్‌లో ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను తెలుసుకునే వీలుంది. అదెలాగో చూద్దామా...
ఆఫ్‌లైన్.. ఆన్‌లైన్
యూజర్లు ఫాస్టాగ్‌ని ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. సెలక్టెడ్ బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎన్‌హెచ్ఏఐ పాయింట్ ఆఫ్ సేల్, సెలక్టెడ్ పెట్రోల్ పంపుల్లో కూడా ఫాస్టాగ్ సేవలను పొందొచ్చు. వీటికి పేమెంట్ మెథడ్‌ని ఇంక్లూడ్ చేసి ప్రిపెయిడ్ వాలెట్ ద్వారా ఫాస్టాగ్‌ని అటాచ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్‌ని ఎప్పుడూ పేమెంట్ మెథడ్ ద్వారా సులభంగా వాడుకోవచ్చు. మరి ఇలా వాడే ఫాస్టాగ్‌ని బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
బ్యాంకుల ద్వారా...
బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి ఫాస్టాగ్ తీసుకుంటే మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీ ఫాస్టాగ్ లింక్ అయి ఉంటుంది. ప్రతి బ్యాంకులోనూ ఫాస్టాగ్ పోర్టల్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు లాగిన్ అయి మీ ఫాస్టాగ్ వివరాలు తెలుసుకోవచ్చు. కొన్ని బ్యాంకుల్లో హోమ్ పేజీలోనే ఫాస్టాగ్ ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో వివరాలు తెలుసుకోవచ్చు.
పేటీఎం ద్వారా..
పేటీఎం వ్యాలెట్ ద్వారా ఫాస్టాగ్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. పేటీఎంలో ఉండే బ్యాలెన్సే మీకు ఫాస్టాగ్ బ్యాలెన్స్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. మీరు ఈ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే పేటీఎం అకౌంట్ లాగిన్ చేసి ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. మీ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే టాప్ అప్ చేసుకోవచ్చు.
ఎన్‌హెచ్ఏఐ వ్యాలెట్
మైఫాస్టాగ్ యాప్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా ఫాస్టాగ్ ఆర్డర్ చేసుకుంటే ఎన్‌హెచ్ఏఐ వ్యాలెట్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ బ్యాలెన్స్‌ను కూడా ఇదే యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో లాగిన్ అయ్యాక మీకు ఎన్‌హెచ్ఏఐ వ్యాలెట్ కనిపిస్తుంది. అక్కడే మీరు ఫాస్టాగ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.