• తాజా వార్తలు

ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా పెట్టి త‌ను ఎప్ప‌టి నుంచో ఏలాల‌నుకుంటున్న కిరాణా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాల‌ని ముకేశ్ అంబానీ ఈ డీల్ కుదుర్చుకున్నార‌ని మార్కెట్ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. దీంతో అటు జియోలో ఫేస్‌బుక్‌కు వాటా ఇచ్చి డ‌బ్బులు సంపాదించ‌డంతోపాటు మ‌రోవైపు రిటైల్ కిరాణా వ్యాపారంలోకి గ్రాండ్‌గా డిజిట‌ల్ అడుగువేయ‌బోతోంది రిల‌య‌న్స్‌.  ఫేస్‌బుక్-జియో అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు  కలగబోతున్నాయ‌ని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్ర‌క‌టించ‌డం దీనికి బ‌లం చేకూరుస్తోంది.  

వాట్సాప్ పేమెంట్స్ ఓకే అయితే 
ప్రధాని మోడీ క‌ల‌లుగంటున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యానికి త‌మ జియో ఫేస్‌బుక్ పార్ట‌న‌ర్‌షిప్ డీల్ కీల‌క‌మ‌లుపు అవుతుందని అంబానీ చెబుతున్నారు.  ఇప్ప‌టికే వాట్సాప్ పేమెంట్స్ మోడ్‌ను రెడీ చేసింది. ఇది ఓకే అయిపోతే జియోమార్ట్  ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్‌లైన్ ప‌ట్టాలెక్కించే ఏర్పాటు జ‌రిగిపోయిన‌ట్లే.  

40 కోట్ల మంది వాట్సాప్ యూజ‌ర్లే కీల‌కం
 ఇండియాలోని దాదాపు 80 శాతం స్మార్ట్‌ఫోన్ల‌లో వాట్సాప్ ఉంద‌ని ఓ అంచ‌నా.  40 కోట్ల మందికి పైగా ఇండియాలో వాట్సాప్‌ను వాడుతున్నారు. వాట్సాప్ పేమెంట్ అమల్లోకి వ‌స్తే మ‌న దేశంలో డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లో అదే టాప్‌లో ఉంటుందని మార్కెట్ అంచ‌నా. అందుకే ఆ 40 కోట్ల మంది వాట్సాప్ యూజ‌ర్ల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న జియో మార్ట్ బిజినెస్‌ను వర్క‌వుట్ చేయాల‌ని అంబానీ మాస్ట‌ర్ ప్లాన్‌. అంటే పేటీఎం మాల్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు బిగ్‌బాస్కెట్ లాంటి దేశీయ కంపెనీల‌కు కూడా జియో మార్ట్ నుంచి బీభ‌త్స‌మైన పోటీ ఎదుర‌వ‌బోతోంద‌న్న‌మాట‌. 

జన రంజకమైన వార్తలు