ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో స్మార్ట్‌ఫోన్లపై సూపర్ ఆఫర్లు.. ఈ రోజే లాస్ట్ ఛాన్స్
ఈకామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. రెడ్‌మీ నుంచి ఐ ఫోన్ దాకా అన్ని కంపెనీల ఫోన్లపై ఈ ఆఫర్లను ఈ నెల 16న ప్రారంభించింది. ఈ రోజే చివరి రోజు.
యాపిల్
ఐఫోన్ ఎస్ఈ లేటెస్ట్ మోడల్ ఫోన్‌పై భారీ తగ్గింపు ధర ప్రకటించింది. ఈ మోడల్ ధరను 42,500 నుంచి 39,900కి తగ్గించింది. ఐఫోన్ టెన్ఆర్ (XR) ధరను 52,500 నుంచి 42,900కి తగ్గించి అమ్ముతోంది.
ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,01,200 కాగా దాన్ని 79,999కి తగ్గించింది.
శాంసంగ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ప్లస్ ప్రారంభ ధర 77,900 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇది 49,999 నుంచి అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ 54,999కి కొనుక్కోవచ్చు.
మోటోరోలా
మోటోరోలా ఈ7 ప్లస్ ధర 8,999.. 500 తగ్గించి 8,4999కి అందుబాటులో ఉంది.
మోటో జీ9 11,499 రూపాయలు కాగా 1500 తగ్గించింది. 9,999 రూపాయలకు దొరుకుతుంది.
మోటో ఫ్యూజన్ ప్లస్ 15,999కి తగ్గించింది. ఇది అసలు ధర కంటే వెయ్యి తక్కువ.
మోటొ ఎడ్జ్ ప్లస్ ధర 74,999 కాగా ఏకంగా 10 వేల ధర తగ్గించి 64,999కి సేల్‌లో అందుబాటులో ఉంది.
పోకో
పోకో ఎం2 6జీబీ ర్యామ్ వేరియంట్ ధఱ 10,999 నుంచి 500 తగ్గి 10,499కి దొరుకుతుంది.
పోకో ఎం2 ప్రోపై 1000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించింది. 12,999కి కొనుక్కోవచ్చు.
రియల్‌మీ
రియల్‌మీ సీ11 వెయ్యి రూపాయల తగ్గింపుతో 6,499కి దొరుకుతుంది.
రియల్‌మీ 7 ధర 14,999. వెయ్యి తగ్గింపుతో 13,999కి లభిస్తుంది.
రియల్‌మీ ఎక్స్3 సూపర్‌జూమ్‌పై 5వేలు తగ్గింది. ఇప్పుడు 24,999కే లభిస్తుంది.
షియోమి
రెడ్‌మీ నోట్8పై 1000 తగ్గించింది. 11,499 నుంచి ప్రారంభ ధర.
రెడ్‌మీ కే20 ప్రో 24,999 నుంచి 22,999కి తగ్గింది.
ఎంఐ 10 5జీ ఫోన్ ధర 2వేలు తగ్గి 47,999కి లభిస్తంది.
ఒప్పో
ఒప్పో ఏ52 16,990 ధరతో లాంచ్ అయింది. ఈ సేల్‌లో 12,990కి దొరుకుతుంది.
ఒప్పో ఏ 15 డిస్కౌంట్‌తో 18,990కి వస్తుంది.
ఒప్పో ఏ31 ధరపై 3వేలు తగ్గింది. ఇప్పుడు 11,990కి దొరుకుతుంది.
ఒప్పో ఏ5 ఎస్ ధర 9,990 నుంచి 7,990కి తగ్గించింది.
ఆసుస్
ఆసుస్ రోగ్‌ఫోన్ 3 ధర తగ్గి 49,999 ప్రారంభ ధరలో లబిస్తుంది.
నోకాస్ట్ ఈఎంఐలు, డిస్కౌంట్లు
ఈ ఫోన్లపై ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్ లపై 3,6,12 నెలల వ్యవధితో నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తోంది. ఎస్‌బీ కార్డ్‌తో కొంటే 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.