గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద పన్ను చెల్లించక్కర్లేని వ్యక్తులు, సంస్థలు కూడా నిల్ రిటర్న్ దాఖలు చేయాలి. అయితే కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కు ఇప్పటికే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అవకాశమిచ్చింది. తాజాగా ఎస్ఎంఎస్ పంపితే చాలు రిటర్న్ దాఖలైనట్లేనని తెలిపింది.
14409 నెంబర్‌కు ఎస్ఎంస్
* జీఎస్టీ నిల్ ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 14409 నంబరుకు ఎస్‌ఎంఎస్‌ను పంపించాలి.
* NIL స్పేస్ R1స్పేస్ GSTIN number స్పేస్ Tax period (నెల, సంవత్సరం) టైప్ చేసి పై నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు
* మీ జీఎస్టీ నిల్ రిటర్న్స్ దాఖలైపోయినట్లే
జులై నుంచి అవకాశం
జీఎస్టీ నిల్ ఖాతాదారులు ఎస్ఎంఎస్ ద్వారా రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశాన్ని జులై మొదటివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీబీఐసీ ప్రకటించింది.