పేటీఎం తన లాయల్ కస్టమర్లకు పోస్ట్‌పెయిడ్ సౌకర్యం కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో పే చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఇది శుభవార్తే .
ఏమిటీ పేటీఎం పోస్ట్‌పెయిడ్?
పేటీఎం సైట్లో లేదా ఇతర ఈకామర్స్ వెబ్సైట్లలో వస్తువులు కొనుక్కోవడానికి లేదా దుకాణాల్లో వస్తువులు కొనుక్కోవడానికి కరెంట్, ఫోన్ బిల్లలు కట్టడానికి వీలుగా పేటీఎం తన లాయల్ కస్టమర్లకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కింద కొంత మొత్తాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని లక్ష వరకు పెంచింది. అయితే కస్టమర్ ట్రాన్సాక్షన్లను బట్టి పోస్ట్‌పెయిడ్ కింద ఎంత మొత్తం ఇవ్వాలనేది కంపెనీ నిర్ణయిస్తుంది. పోస్ట్ పెయిడ్ సేవలు లైట్, డిలైట్ మరియు ఎలైట్ అనే మూడు విభాగాల్లో లభిస్తున్నాయి. దీని కింద మీకు 20వేల నుంచి లక్ష వరకు అమౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఈఎంఐల్లోనూ కట్టుకోవచ్చు
* ఇలా పేటీఎం ద్వారా ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఇకపై ఒకేసారి కట్టాల్సిన పనిలేదు. దీన్ని ఈఎంఐల ద్వారా కూడా చెల్లించవచ్చు.
దీనికి కొంత వడ్డీ వేస్తుంది.
* పోస్ట్‌పెయిబ్ బిల్లు జనరేట్ అయిన వారం రోజుల్లోపు దాన్ని ఈఎంఐగా మార్చుకోవచ్చు.
* కొవిడ్ నేపథ్యంలో వినియోగదారుల చేతిలో డబ్బులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి కోసం ఈఎంఐ ఫెసిలిటీ తీసుకొచ్చినట్లు పేటీఎం ప్రకటించింది.