• తాజా వార్తలు

వాట్సాప్ ద్వారా జియోమార్ట్‌లో స‌రుకులు ఆర్డ‌ర్ చేయ‌డం ఎలా?

రిల‌య‌న్స్ ఇటీవ‌ల ఫేస్‌బుక్‌తో జ‌ట్టుక‌ట్టింది. త‌న జియోమార్ట్ నుంచి సరుకుల‌ను వాట్సాప్ ద్వారా ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు. ఎంపిక చేసిన న‌గ‌రాల్లో ఈ సేవ‌ల‌ను ప్రారంభించింది.  వాట్సాప్ ద్వారా జియో మార్ట్‌లో ఆర్డ‌ర్స్ ఎలా చేసుకోవాలో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుంది.  

ఇదీ ప్రొసీజ‌ర్‌

మీ స్మార్ట్‌ఫోన్‌లో  +91 88500 08000 నెంబ‌ర్‌ను జియో మార్ట్ పేరుతో సేవ్ చేసుకోండి.
వాట్సాప్ ఓపెన్ చేసుకుని జియో మార్ట్ సెలెక్ట్ చేయండి.
 Hi అని మెసేజ్ పంపండి
వెంటనే మీకు ఓ ఆటోమేటెడ్ మెసేజ్ వ‌స్తుంది.  Welcome to JioMart – WhatsApp Order booking Service అని మెసేజ్ వ‌స్తుంది. దాంతోపాటు ఓ లింక్ వ‌స్తుంది.
* ఆర్డ‌ర్ ఇవ్వాలంటే ఆ లింక్‌ను క్లిక్ చేయాలి
* లింక్ క్లిక్ చేయ‌గానే జియో మార్ట్ సైట్‌కు డైరెక్ట్ అవుతుంది. అక్క‌డ మీరు కావాల్సిన నిత్యావ‌స‌రాలు ఎంచుకుని ఆర్డ‌ర్ చేయాలి.
* మీ పేరు, పూర్తి అడ్ర‌స్‌, ఫోన్ నెంబ‌ర్  మొద‌లైన వివ‌రాల‌న్నీ ఎంట‌ర్ చేయాలి.
* ఆటా, ర‌వ్వ‌, శ‌న‌గ‌పిండి చాలావ‌ర‌కు నిత్యావ‌స‌రాలు ఇత‌ర ఈకామ‌ర్స్ సైట్ల‌లో కంటే త‌క్కువ ధ‌ర‌కే ఇస్తున్నామ‌ని జియోమార్ట్ చెబుతోంది.

ఈ న‌గ‌రాల‌కే ప‌రిమితం
న‌వీముంబ‌యి, థానే, క‌ల్యాణ్  న‌గరాల్లో ప్ర‌స్తుతం జియో మార్ట్  సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. మీరు వాట్సాప్ లింక్ ద్వారా జియో మార్ట్‌లోకి వెళ్లి స‌రుకులు ఆర్డ‌ర్ చేయాలి.  ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు మీరు ఆర్డ‌ర్ చేసిన స‌రుకుల‌ను 48 గంట‌ల్ల‌గా స‌మీపంలోని జియోమార్ట్ కిరాణా షాపుల‌కు వెళ్లి తెచ్చుకోవ‌చ్చు.  
మీరు ఆర్డ‌ర్ చేసిన స‌రుకుల‌ను రెడీ చేశాక సంబంధిత షాప్ నుంచి మీకు మెసేజ్ వ‌స్తుంది.  లాక్‌డౌన్ ఉన్నందున ప్ర‌స్తుతానికి డోర్ డెలివ‌రీ ఆప్ష‌న్ లేదు.

జన రంజకమైన వార్తలు