• తాజా వార్తలు

ఐఆర్‌సీటీసీ సైట్ - ౩ గంటల్లో 10 కోట్ల ఆదాయం, సైట్ క్రాష్

భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత‌గా ఏకంగా 50 రోజుల‌కు  పైగా ప్ర‌యాణికుల రైళ్లు నిలిచిపోయాయి. కరోనా వైర‌స్‌ను నిరోధించ‌డానికి లాక్‌డౌన్ తెచ్చిన ప్ర‌భుత్వం దానిలో భాగంగా ప్ర‌యాణికుల రైళ్ల‌ను ఆపేసింది.  స‌ర‌కు ర‌వాణా కోసం గూడ్స్ రైళ్లు తిరిగినా ప్యాసింజ‌ర్ రైళ్లు నిలిపేశారు. అలాంటిది 15 రైళ్లు నడుపుతామ‌ని రైల్వే ప్ర‌క‌టించ‌గానే జనం ఎగ‌బ‌డ్డారు.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..

3 గంట‌ల్లో 10 కోట్ల ఆదాయం
15 ఏసీ రైళ్ల‌కు అనుమ‌తిస్తామ‌ని టికెట్ బుకింగ్  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌లో మాత్ర‌మే చేసుకోవాల‌ని రైల్వే ఈ నెల 10న ప్ర‌క‌టించింది. స్టేష‌న్ల‌లో టికెట్లు అమ్మ‌ర‌ని, అలాగే ఇంకే యాప్‌లోనూ, సైట్‌లోనూ కూడా ఈ టికెట్లు దొర‌క‌వ‌ని చెప్పింది. 11వ తేదీ సాయంత్రం 4 గంట‌లకు ఐఆర్‌సీటీసీ సైట్ ఓపెన్ అవుతుంద‌ని చెప్పింది. అంతే 11వ తేదీ సాయంత్రం 4 గంట‌ల నుంచి ప్ర‌యాణికులు సైట్ మీద ప‌డ్డారు.  కేవ‌లం 3 గంట‌ల్లోనే 30 వేల టికెట్లు కొనేశారు. దీంతో  రైల్వేకు సుమారు రూ.10 కోట్ల ఆదాయం వ‌చ్చింది. అయితే ఒకానొక స్టేజ్‌లో ట్రాఫిక్ ఎక్కువై ఐఆర్‌సీటీసీ సైట్ క్రాష్ అయిపోయింది.  
 

షేర్ య‌మా స్పీడ్‌
మ‌రోవైపు స్టాక్ మార్కెట్లో మాత్రం ఐఆర్‌సీటీసీ షేర్ దూసుకుపోయింది. కరోనా  వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం తరువాత  ప్రత్యేక రైలు సేవలు  ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే ఐఆర్‌సీటీసీ షేర్.. షేర్ మార్కెట్లో భారీ లాభాలకు అమ్ముడుపోయింది. టికెట్ల అమ్మ‌కాల దూకుడుతో రెండోరోజూ ఈ షేర్ భారీ లాభాలతో దూసుకెళ్లింది. 

జన రంజకమైన వార్తలు