కరోనా వచ్చాక జనం కొత్తవాళ్లను చూస్తేనే కంగారుపడుతున్నారు. ఇక నో యువర్ కస్టమర్ (కేవైసీ) లాంటివి చేయడానికి ఎవరైనా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇంటికొస్తే రానిస్తారా? వాళ్లు బయోమెట్రిక్ యంత్రాలు తెస్తే దానిలో ఫింగర్‌ప్రింట్ వేసే ధైర్యం ఉంటుందా? ఇది ముఖ్యంగా ఇన్సూరెన్స్, లోన్ ఎగ్జిక్యూటివ్‌లకు చాలా కష్టంగా ఉంటోంది. ఈకేవైసీ పూర్తి చేయకపోతే అప్లికేషన్ ప్రాసెస్ అవదు. అందుకే ఐఆర్‌డీఏ ఇన్సూరెన్స్ యూజర్లకు వీడియో బేస్డ్ కేవైసీకి పర్మిషన్ ఇచ్చింది. దీనివల్ల కస్టమర్లు కొత్త వ్యక్తిని డైరెక్ట్‌గా మాట్లాడాలన్న భయం ఉండదు. వైరస్ సోకుతుందని భయపడుతున్న పరిస్థితుల్లో ఇది మంచి ఆప్షన్.
ఎలా చేస్తారు?
లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేసేవాళ్లందరికీ ఈ వీడియో కేవైసీ చేయొచ్చు.
ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి దీన్ని చేయవచ్చు. అయితే ఇండియాలో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం.
వీడియో కాల్ చేసి కస్టమర్ వివరాలు తీసుకోవాలి
అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీలను ఉపయోగించి కస్టమర్ ఫేస్‌ను గుర్తించవచ్చు.
రికార్డ్ చేయాలి.
లైవ్ లొకేషన్ ఆన్ చేసి జియో ట్యాగింగ్ చేయాలి.
కేవైసీ ప్రాసెస్‌నంతా రికార్డ్ చేయాలి.
కస్టమర్‌ను ఐడెంటిఫై చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ ఉండాలి
ఆథార్ అథెంటికేషన్ (ఇది వాలంటరీనే. బలవంతం చేయకూడదు). ఆధార్ సెక్యూర్ క్యూఆర్, లేదా ఎక్స్ ఎంఎల్ ఫైల్‌ను కస్టమర్ నుంచి తెప్పించుకుని మొత్తం కరెక్ట్‌గా ఉందనుకున్నాకే వీడియో కేవైసీ స్టార్ట్ చేయాలి.