కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ తన కొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ6పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ మొబైల్‌పై 10వేలకు పైగా ధరను తగ్గిస్తుందని గత నెలలోనే వార్తలు వచ్చాయి. అయితే ఎల్‌జీ లేటెస్ట్ గా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
41,990 రూపాయలు..
ఎల్‌జీ జీ5 తర్వాత గత ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ జీ6 మోడల్‌ను ఆవిష్కరించింది. ఇండియాలో దీని ధర 51,990 రూపాయలు. లేటెస్ట్ ఆఫర్‌తో ఈ మోడల్ అమెజాన్‌లో రూ.41,999కి లభిస్తోంది.
స్పెసిఫికేషన్స్
* 5.7 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే (18:9 నిష్పత్తిలో స్క్రీన్ ఉంటుంది కాబట్టి బాగా పెద్దగా కనిపిస్తుంది)
* 4 జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీకార్డ్‌తో ఏకంగా 2టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
* 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ ఛార్జింగ్ ఆప్షన్)
* రియర్ సైడ్‌లో రెండు 13 ఎంపీ కెమెరాలు (4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్)
* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* వాటర్, డస్ట్ రెసిస్టెంట్
* ఆండ్రాయిడ్ నోగట్ 7.0
* గూగుల్ అసిస్టెంట్