• తాజా వార్తలు

డీ మానిటైజేషన్ ను ఎదుర్కోవడానికి టెక్నాలజీ అందిస్తున్న పలు అద్బుత యాప్స్

కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన నాటినుండీ అందరి మనసులలో మెదలుతున్న ఒకే ఒక ప్రశ్న “ఈ దగ్గర లో ఏదైనా ATM ఉందా?” అవును డబ్బు లేనిదే ఏ పనీ చేయలేము. నోట్ల రద్దు వలన మన దగ్గర డబ్బు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటపుడు ATM కోసం వెతకడం సర్వ సాధారణం. కానీ ATM ల ముందు ఉంటున్న క్యూ లను చూస్తుంటే వాటిని వర్ణించడానికి కవులు కొత్త కొత్త పదాలను వెతుక్కుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మన దగ్గర లో ఉన్న ATM లు వాటిలో డబ్బు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అనేక రకాల యాప్ లు వచ్చేశాయి. దాదాపు సమాజం లోని ప్రతీ సమస్యకూ పరిష్కారం చూపిస్తున్న టెక్నాలజీ  ఈ సమస్యకు కూడా చూపించింది. ఆ యాప్ లు ఏమిటో ఈ వ్యాసం లో చూద్దాం.

1. క్యాష్ నో క్యాష్

క్వికర్ అండ్ నాస్కాం లు ఈ కాష్ నో కాష్ లేదా cashnocash.com ను లాంచ్ చేశాయి. ఇది మీ సమీపం లోని ATM లు వాటిలో ఉన్న డబ్బు కు సంబందించిన సమాచారాన్ని మీకు అందించే ఒక వెబ్ సైట్. ఇది పిన్ కోడ్ ను ఆధారం చేసుకుని మీకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉన్న సెర్చ్ బటన్ లో మీరు ఉన్న ఏరియా యొక్క పిన్ కోడ్ ను ఎంటర్ చేసినట్లయితే అది మీ ఏరియా లోని పని చేస్తున్న ATM ల వివరాలను మీకు అందిస్తుంది. డబ్బు ఉన్న ATM లు పచ్చ రంగులో కనిపిస్తాయి. పెద్ద పెద్ద క్యూ లు ఉన్న ATM లు ఆరంజ్ రంగు లోనూ డబ్బు లేని ATM లు ఎరుపు రంగు లోనూ కనిపిస్తాయి.

2. CMS ATM Finder

CMS ఇన్ఫో సిస్టమ్స్ అనే కంపెనీ దేశ వ్యాప్తంగా సుమారు 55,000 లకు పైగా ATM లను మేనేజ్ చేస్తుంది.  ఇక్కడ కూడా మీరు ఉంటున సిటీ పేరు ఎంటర్ చేస్తే అందులో ఉన్న ATM ల వివరాలు ఏ ఏ ATM లలో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎక్కడ డబ్బులు లేవు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద క్యూ లైన్ లు ఉన్నాయీ తదితర విషయాలకు సంబందించిన సమాచారం అంతా చూపిస్తుంది. ఇది దేశం లోని కేవలం 55,000 ATM లకు సంబందించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది కానే చాలా ఖచ్చితంగా ఇస్తుంది.

3. Walnut

పర్సనల్ మేనేజ్ మెంట్ యాప్ అయిన వాల్ నట్  కూడా ఈ విషయం లో మీకు సహాయం చేయడానికి సరికొత్త ఫీచర్ లను ప్రవేశపెట్టింది. ఇది 2 మిలియన్ లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఇది కూడా మీ ఏరియా లో ఉన్న పనిచేసే ATM ల వివరాలను మీకు అందిస్తుంది. ATM ల ముందు ఉన్న క్యూ ల గురించి కూడా ఇది వివరాలను అందిస్తుంది. దీని యొక్క తర్వాతి అప్ డేట్ లో ATM లలో ఏ ఏ నోట్ లు ఉన్నాయో కూడా తెలిపే సమాచారం ప్రవేశపెట్టే యోచనలో దీని యాజమాన్యం ఉంది.

పనిచేయని ATM లను గ్రే రంగు లో చూపిస్తుంది, రీసెంట్ గా ఆక్టివ్ అయిన వాటిని పచ్చ రంగు లోనూ, మీకు దగ్గర లో డబ్బు తో ఉన్న ATM లను పచ్చ రంగు లోనూ చూపిస్తుంది.

4. ATM search

ఈ ATMsearch అనేది కూడా మీకు దగ్గరలో ఉన్న ATM ల వివరాలను అందించే ఒక వెబ్ సైట్. ఇందులో మీరు ఉన్న ఏరియా యొక్క పేరు టైపు చేస్తే వెంటనే మీకు దగ్గర లో ఉన్న ATM ల వివరాలు అక్కడ కనిపిస్తాయి. ఆయా ATM లలో డబ్బు ఉన్నదీ లేనిదీ, వాటి ముందు ఉన్న క్యూ లైన్ ల వివరాలు ఇది చూపిస్తుంది. అంతేగాక ఇది ఆ ATM లు ఏ బ్యాంకు కు సంబందించినవో కూడా ఇది చూపిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు