మొబైల్ వాలెట్ పేటీఎం క్రెడిట్ కార్డులు ఇష్యూ చేయబోతోంది. పలు క్రెడిట్ కార్డు కంపెనీలతో పార్టనర్‌షిప్ కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఏడాదిన్నర కాలంలో 20 లక్షల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నది పేటీఎం టార్గెట్.
మంచి ఫీచర్లతో మార్కెట్లోకి
* పేటీఎం కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మామూలు క్రెడిట్ కార్డుల్లో లేని భిన్నమైన ఫీచర్లతో రాబోతున్నాయి.
* కార్డ్ పిన్ మార్పు, అడ్రస్ చేంజ్, కార్డ్ బ్లాకింగ్ వంటివన్నీ వన్‌టచ్ సర్వీస్‌తో అందుబాటులోకి వస్తాయి.
రివార్డులు
ఈ కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లతో చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌కూ రివార్డ్ ప్రోగ్రాం తీసుకురానుంది. ఇలా వచ్చే రివార్డ్ పాయింట్స్‌ను పేటీఎంలో ఏ లావాదేవీకైనా వాడుకోవచ్చు. వీటిని వాడుకోవడానికి ఎలాంటి టైమ్ పిరియడ్ లేకపోవడం మరో మంచి అవకాశం.
ఫ్రాడ్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్లకు ఇన్సూరెన్స్
క్రెడిట్ కార్డ్ యూజర్లకున్న పెద్ద దిగులు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్. ఇలాంటివి ఏవైనా జరిగితే కంపెనీని పదేపదే కాంటాక్ట్ చేస్తేగానీ సమస్య తీరదు. ఆ బాధలు లేకుండా ఇలాంటి మోసపూరిత ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆదుకునేలా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా తీసుకురాబోతోంది.