డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం చిరువ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి గ్యారంటీ లేకుండానే 5 లక్షల వరకు లోన్స్ ఇస్తామని ప్రకటించింది. బ్యాంక్ రుణాలు అందుకోలేని కిరాణా దుకాణాలు, ఇతర చిన్నవ్యాపారులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. వ్యాపార లావాదేవీల కోసం పేటీఎం యాప్స్ ఉపయోగిస్తున్నవారు ఈ లోన్ తీసుకోవడానికి అర్హులు.
రెండింతల రుణం
ఇప్పటికే పేటీఎం ఇలాంటి చిరువ్యాపారులకు 2.5 లక్షల రూపాయల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 550 కోట్ల రుణాలను అందించింది. దీన్ని ఇప్పుడు రెండింతలు చేయబోతుంది. అంటే 1000 కోట్ల వరకు లోన్స్ ఇవ్వనుంది. వడ్డీ 1% నుంచి 2% వరకు ఉంటుంది.
17 లక్షల మంది డేటా
చిరువ్యాపారులకు 1000 కోట్ల రుణాలివ్వడానికి 2021 మార్చి వరకు టార్గెట్ పెట్టుకుంది. పేటీఎం యాప్, పేటీఎం పేమోంట్స్ బ్యాంక్ వద్ద ఇప్పటికే 17 లక్షల మంది వ్యాపారుల డేటా ఉంది. ఆ డేటా, ట్రాన్సాక్షన్ల విలువ ఆధారంగా ఈ లోన్లు ఇస్తామని పేటీఎం ప్రకటించింది.