పేటీఎం వాలెట్ వాడుతున్నారా.. మీకో శుభవార్త. ఇకమీదట మీ వాలెట్లో ఉన్న ఎమౌంట్‌కు ఇన్సూరెన్స్ కవరేజి రాబోతోంది. మొబైల్ వాలెట్లతో అంతా సౌకర్యమే అయినా సెక్యూరిటీ తక్కువని యూజర్స్ ఆలోచిస్తుంటారు. దాన్ని కూడా దూరం చేయడానికి పేటీఎం.. వాలెట్‌లోని బ్యాలెన్స్ కు ఇన్స్యూరెన్స్ చేస్తోంది. అంటే మీ పేటీఎం యాప్ ఇక సోఫిస్టికేటెడ్ మాత్రమే కాదు సెక్యూర్డ్ కూడా.
కవరేజ్ ఎలా?
దీనికోసం ఇతర ఇన్స్యూరెన్స్ ల్లా ప్రీమియం కట్టాల్సిన పని లేదు. మీ వాలెట్లో ఉన్న అమౌంట్‌కు ఆటోమేటిగ్గా ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది.
మీరు ఎప్పుడైనా వాలెట్ ఉన్న డివైస్‌ను పోగొట్టుకున్నా లేదా మీ అనుమతి లేకుండా దాన్ని ఎవరైనా వినియోగించినా అలాంటి సందర్భాల్లో మీకు ఆ అమౌంట్‌ను పేటీఎం తిరిగి మీ అకౌంట్‌లో జమ చేస్తుంది.
ఇన్స్యూరెన్స్ ఎప్పుడు కవర్ అవుతుంది?
* మొబైల్‌ఫోన్ లేదా డివైస్ ను ఎవరైనా దొంగిలించి దానితో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు..
* యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎవరైనా దొంగిలించి మీ వాలెట్‌లోని బ్యాలెన్స్ వాడేసినప్పుడు..
ఎలా క్లెయిం చేసుకోవాలి?
* మీ సెల్‌ఫోన్ లేదా డివైస్ పోయినా, దొంగతనానికి గురైనా 12 గంటల్లోపు care@paytm.com కి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. లేదా కస్టమర్ కేర్ నెంబర్ 91 9643979797కి ఫోన్ చేసి కంప్లయింట్ చేయాలి.
* కంప్లయింట్ అందిన రెండు గంటల్లోగా పేటీఎం ఆ వాలెట్ ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేస్తుంది.
* 24 గంటల్లోగా మీ ఫోన్ పోయిందని పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేసి ఎఫ్ ఐ ఆర్ కాపీ తీసుకుని పేటీఎంకు పంపాలి.
* క్లెయిం జన్యూన్ అని పేటీఎం నిర్ధరించుకుంటే మీరు వాలెట్‌లో కోల్పోయిన ఎమౌంట్‌ను 5 పని దినాల్లో (వర్కింగ్ డేస్‌లో) తిరిగి వాలెట్‌లో జమ చేస్తుంది. మీరు పేటీఎం వాలెట్ యాక్సెస్‌ను కొత్త పాస్‌వర్డ్‌తో రీ యాక్సెస్ చేసుకున్నాకే మీ వాలెట్‌లోని క్యాష్‌ను మీరు వాడుకోగలుగుతారు.
నిబంధనలు
* పోగొట్టుకున్న 12 గంటల్లోపు కచ్చితంగా కంప్లయింట్ చేయాలి.
* వాలెట్‌లో బ్యాలెన్స్ 20 వేల వరకే ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. దొంగతనం జరిగితే 20 వేలు లేదా వాలెట్‌లో పోగొట్టుకున్న మొత్తం ఏది తక్కువైతే అంతకే క్లెయిం చెల్లిస్తారు.
* సంవత్సర కాలంలో ఒక్కసారి మాత్రమే క్లెయిం చెల్లిస్తారు.
* కస్టమర్ నిర్లక్ష్యం వల్ల వాలెట్‌లో మనీ పోతే క్లెయిం ఇవ్వరు.
* పొరపాటున ఏదైనా వేరే నెంబర్‌కు మనీ పంపేసినా ఆ సందర్భంలోనూ మనీ తిరిగి యాడ్ చేయరు.
* పేటీఎం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసే లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను అప్‌గ్రేడ్ లేదా ఎడాప్ట్ చేసుకోని కస్లమర్లు వాలెట్‌లో మనీని పోగొట్టుకున్నా ఎలాంటి క్లెయిం తిరిగివ్వరు. కాబట్టి యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
మీ పేటీఎం యాప్‌లో అప్‌డేట్ సెక్షన్‌లోకి వెళ్లి చూడండి. రీసెంట్ మెసేజెస్‌లో యువర్ పేటీఎం వాలెట్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్స్యూర్డ్ అని మెసేజ్ వచ్చి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చ